Mohammed Shami: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ తన కుమార్తె ఐరాను మిస్ అవుతున్నట్లు తెలిపారు. తనని కలుసుకోలేకపోతున్నానని షమీ ఆవేదన చెందుతున్నాడు. విభేదాల కారణంగా కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడటం కుదురుతుందని తెలిపాడు. మహమ్మద్ షమీ, హసిన్ జహాన్‌కు 2014లో వివాహం కాగా 2015లో ఐరా జన్మించింది. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు.
ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలని కోరుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. తనను చాలా మిస్ అవుతున్నానని షమీ తెలిపారు. హసిన్ జహాన్ అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. నా కుమార్తె నాతో మాట్లాడటం ఆమెపై ఆధారపడి ఉంది. చాలారోజుల నుంచి నేను తనను చూడలేదు. నా కుమార్తె ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. హసిన్‌కు నాకు మధ్య జరిగే వివాదం మాఇద్దరి వరకు మాత్రమే. అక్కడ ఐరా సంతోషంగా ఉండాలని, ఉంటుందని అనుకుంటున్నాని షమీ తెలిపాడు.