»Uttarakhand Violence Broke Out After The Demolition Of The Madrasa High Alert Across The State
Uttarakhand: మదర్సా కూల్చివేతతో చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఉత్తరాఖండ్లో మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ప్రస్తుతం హింస ఉద్రిక్తంగా ఉంది. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
Uttarakhand: ఉత్తరాఖండ్లో మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్ కార్మికులపై స్థానికులు రాళ్లు విసిరారు. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్ను కూడా తగులబెట్టారు. ఉద్రిక్తతలు చేలరేగడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అలాగే ఎవరైనా కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు కూడా జారీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా గాయాలు అయ్యాయి.
ప్రస్తుతం అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. బన్భూల్పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదు నిర్మించారు. వీటిని తొలగించాలని గతంలో నిర్వాహకులను నోటీసులు ఇచ్చిన స్పందించలేదు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. దీంతో ఘర్షణలు మొదలయ్యాయి.