»Upasana Interesting Comments On Hero Vijays New Party
Upasana: హీరో విజయ్ కొత్త పార్టీపై మెగా కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. కొత్తగా పార్టీని స్థాపించి కార్యచరణ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మెగా కోడలు కొణిదెల ఉపాసన విజయ్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Upasana interesting comments on hero Vijay's new party
Upasana: తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం(Tamilaga Vetri Kazhagam) పార్టీని నెలకొలిపి అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన(Upasana) స్పందించారు. నటుడిగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రశంసించారు. కేవలం సమాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్ప విషయమని చెప్పారు.
ఈ సందర్భంగా తాను అందరికీ ఒకటే చెప్పాలనుకున్నానని.. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే నాయకుడు ఎవరనేది చూడకుండా మద్దతు ఇవ్వాలని ఉపాసన పేర్కొన్నారు. సపోర్టు చేయని పక్షంలో వెనక్కి మాత్రం లాగొద్దని తెలిపారు. కొత్త నాయకులు, సరికొత్త ఆలోచనతో వస్తారు అని వారికి ప్రజలు అండగా నలిబడితే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు. తమిళనాడులో కూడా మార్పు వస్తుందనే వెల్లడించారు. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని కానీ మార్పు తీసుకొచ్చే లీడర్కు మద్దతు ఉంటుందని వెల్లడించారు.