»Anupama Parameswaran Shocking Is Anupama Parameswaran Married
Anupama Parameswaran: షాకింగ్.. అనుపమా పరమేశ్వరన్ పెళ్లి చేసుకుందా?
మళయాళి క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. తక్కువ కాలంలోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ బ్యూటీ ఉన్నట్టుండి పెళ్లి కూతురుగా మెడలో తాళి బొట్టుతో కనిపించి షాక్ ఇచ్చింది.
Anupama Parameswaran: గతంలో ఓసారి సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ.. అను చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఒక ప్లాస్టిక్ కవర్‌ను ఉంగరంలా వేలికి తొడిగిన ఫోటోని షేర్ చేసి.. తన ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిజంగానే అనుపమ పరమేశ్వరన్ ఎంగేజ్మెంట్ చేసుకుందా? అంటూ, అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. కానీ తీరా అసలు విషయం తెలిశాక అమ్మడిపై.. ఫన్నీగా రకారకాల కామెంట్స్ చేశారు. కానీ ఇలాంటి షాకులు ఇచ్చి ఫ్యాన్స్‌ను హర్ట్ చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. అది కూడా మెడలో తాళిబొట్టుని చూపిస్తూ మరి ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ షాక్ అయ్యారు. మెడలో తాళిబొట్టు, పట్టుచీర, పాపిట తిలకంతో పెళ్ళైన మహిళలా కనిపంచింది. ఈ పోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది అనుపమా. దాంతో కొంపదీసి అనుపమా పెళ్లి చేసుకుందా? అని ఆశ్చర్యపోయారు నెటిజన్స్.
ఈ ఫోటోలకు When the bride got a little too excited listening to #Netruvarai అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఇదేదో సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు అయిన ఉండాలి, లేదంటే ఏదైనా కమర్షియల్ యాడ్స్‌కు సంబంధించిన ఫోటో షూట్ అయి ఉంటుందని అంటున్నారు. అన్నట్టే ఈ ఫొటోలు ఓ సినిమాకు సంబంధించినవి. ప్రస్తుతం తమిళంలో జయం రవితో కలిసి ‘సైరెన్’ అనే సినిమాలో నటిస్తోంది అనుపమా. తాజాగా ఈమూవీ నుంచి ‘నేత్రు వరై’ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలోనే జయం రవి, అనుపమా పెళ్లి చేసుకున్నట్టుగా చూపించారు. దీంతో అనుపమా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏదేమైనా.. అనుపమా పెళ్లెప్పుడు అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్నట్టు.. త్వరలోనే తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనుపమా.