గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రతిసారి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తునే ఉన్నాడు. కానీ హిట్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తోనైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ టైం ఫిక్స్ చేశారు.
Nitin: గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇటీవల రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్‌తో కూడా హిట్ కొట్టలేకపోయాడు. దీంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. తనకు భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. 2020లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు నితిన్. చెక్, రంగ్‌దే, మాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలు సరైన విజయాలు అందుకోలేకపోయాయి. దాంతో భీష్మ డైరెక్టర్‌తో కలిసి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. VNRTrio అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన నితిన్, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఆ తర్వాత.. VN2గా మారిపోయింది. ఎందుకంటే.. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను అనుకున్నారు. కానీ రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అయినా ఇప్పటి వరకు మరో కొత్త హీరోయిన్ పేరు రివీల్ చేయలేదు. కానీ తాజాగా VN2 ప్రాజెక్ట్ నుంచి.. ‘అన్ మాస్కింగ్ ది కాన్ మాన్’ అంటూ అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ పోస్టర్లో నితిన్ బ్యాగ్ తగిలించుకోని నిలబడి ఉన్నాడు. బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫోటో ఉంది. దీంతో ఈ సినిమాలో వెంకీ కుడుముల ఎంటర్టైన్మెంట్తో పాటు కాస్త యాక్షన్ డోస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి #VN2 నుంచి రానున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుంది? నితిన్ ఈసారైనా హిట్ కొడతాడా లేదా? అనేది చూడాలి.