»Rakul Preet Singh Will Do The Same After Marriage Rakuls Comments Go Viral
Rakul Preet Singh: పెళ్లి తర్వాత కూడా అదే చేస్తా.. రకుల్ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. కానీ సంక్రాంతికి మాత్రం తమిళ్లో అయలాన్ సినిమాతో హిట్ కొట్టింది. హిందీలోను కొన్ని సినిమాల్లో నటిస్తోంది. కానీ త్వరలోనే రకుల్ పెళ్లి పీటలెక్కబోతోంది. ఆ తర్వాత కూడా అదే పని చేస్తానని చెబుతోంది రకుల్.
Rakul Preet Singh: తెలుగులో ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇక్కడ క్రేజ్ తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. చివరగా క్రిష్ తెరకెక్కించిన కొండపొలం సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటినుంచి రకుల్‌కు టాలీవుడ్లో ఆఫర్లు తగ్గిపోయాయి. అమ్మడు కూడా బాలీవుడ్ పై మోజు పెంచుకుంది. కానీ అనుకున్నంత రేంజ్లో అక్కడ రాణించలేకపోయింది. అందుకే ఓ రేంజ్లో గ్లామర్ ఒలకబోస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ. అయినా అమ్మడిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. కానీ తమిళ్లో మాత్రం శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అయలాలన్ తెలుగులో రిలీజ్ అవుతోంది. మరోవైపు కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2లో కూడా నటిస్తోంది రకుల్. ఇదిలా ఉంటే.. గత కొన్నాళ్లుగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది రకుల్. ఫైనల్‌గా ఫిబ్రవరి 22న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. పెళ్లి తర్వాత రకుల్ హీరోయిన్గా సినిమాలు చేస్తుందా? అందుకు జాకీ భగ్నానీ ఒప్పుకుంటాడా? అనేది ఇప్పుడే చెప్పలేం.
తాజాగా దీని పై రకుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో చేస్తాను. అందరి అంగీకారంతోనే ముందుకు వెళ్తాను. పెళ్లి తర్వాత హీరోయిన్గా చేయడం కొత్త అనుభూతి ఇస్తుంది. ప్రేక్షకుల్ని అలరించాలని తెరమీదకు వస్తున్నాం. అందుకు పెళ్లి అడ్డం కాదని.. చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి తర్వాత కూడా రకుల్ హీరోయిన్గా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.