Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 18th).. హనుమాన్ చాలీసా చదవండి.
ఈ రోజు(2024 January 18th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
ప్రారంభించిన పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి. బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. మిశ్రమఫలితం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నతంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవడం మంచిది.
వృషభం
కీలక వ్యవహారాల్లో తొందరపడకూడదు. అధికారులు మీ పనితో సంతృప్తి పడరు. స్థిర నిర్ణయాలు తీసుకోవడం మానసికంగా మంచిది. కలహాలకు దూరంగా ఉండడం ఉత్తమం. నవగ్రహ శ్లోకాలు చదవడం మరవొద్దు.
మిథునం
ప్రారంభించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నీతీనిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే అంతా మంచే జరుగుతుంది.
కర్కాటకం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. సొంతింటి కల నెరవేరుతుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ కుంటుంబాన్ని ఆనందపరుస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పారయాణ మంచిది.
సింహం
పని భారంతో అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు తీసుకోవడం మరిచిపోవద్దు. చాలా కాలంగా చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివడం మంచిది.
కన్య
సమయాన్ని వృథా చేయొద్దు. కాలంతో పాటు నడుచుకోవాలి. పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహించాలి. ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శ్రీలక్ష్మి సందర్శనం ఉత్తమం.
తుల
బలంగా కోరుకుంటే పనులు పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉత్సాహంగా పనిచేయడం మంచిది. ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత కోల్పోతారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దుర్గాధ్యానం వల్ల మంచి జరుగుతుంది.
వృశ్చికం
ప్రారంభించిన పనులు ఈజీగా పూర్తి అవుతాయి. అధికారుల సహాయం తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సూర్య ఆరాధన మంచిది.
ధనస్సు
మానసికంగా దృఢంగా ఉండడం మంచిది. అప్పు సులువుగా పొందుతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. హనుమాన్ చాలీసా మానసిక బలాన్ని చేకురుస్తుంది.
మకరం
దైవబలం మీకు తోడౌతుంది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. పెద్దల నిర్ణియాలను పాటించండి. బంధు, మిత్రుల సహకారం తీసుకుంటారు. శనిధ్యానం మరవకండి.
కుంభం
మొదలు పెట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలకు వెళ్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకాన్ని చదివితే శుభప్రదం.
మీనం
పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.