Mirzapur 3: మూవీ లవర్స్ చాలా కాలంగా ఓటీటీ(OTT)లకు అలవాటు పడిపోయారు. అందుకే ఓటీటీ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. అది ఏ రేంజ్లో విజయం సాధించిందంటే ఏకంగా సీజన్ 3 కూడా తీసేంతలా హిట్ కొట్టింది. అత్యంత వ్యూస్ సాధించిన మీర్జాపూర్ (Mirzapur) రెండు సీజన్లు ఒక ఎత్తు అయితే మూడోది మాములుగా ఉండదని తెలుస్తుంది. కస్ వర్డ్స్, అడల్ట్ సీన్స్ మాత్రమే కాకుండా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే ప్రేక్షకులంతా మూడోదాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న మూడో భాగం మార్చి చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నట్లు సమాచారం. సంవత్సరం క్రితమే షూటింగ్ పూర్తయినట్లు నటీనటులు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.
డైరెక్టర్ గుర్మీత్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో ఈ సిరీస్‌లను తెరకెక్కించారు. మొదటి సీజన్ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించారు. ఇక దీనికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ రిలీజ్ అయింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. తొలి సీజన్లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో చూపించారు. దీంతో మూడో సీజన్‌పై ఆసక్తి పెరిగింది. దీనిలో విజయ్ వర్మ కీలకపాత్రలో నటించారు.