Hanu Man Collections crossed 100 Crores: 100 కోట్ల క్లబ్’లో హనుమాన్
హనుమాన్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ 100 కోట్ల మైలురాయిని దాటేసింది. మరింత జోరుగా ముందుకు దూసుకుపోతోంది. మౌత్ పబ్లిసిటీ విపరీతంగా పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. హనుమాన్ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
హనుమాన్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ 100 కోట్ల మైలురాయిని దాటేసింది. మరింత జోరుగా ముందుకు దూసుకుపోతోంది. మౌత్ పబ్లిసిటీ విపరీతంగా పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. హనుమాన్ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనవరి 12న తెలుగుతో పాటు మరో 10 భాషల్లో విడుదల చేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను డీల్ చేసిన విధానం ప్రేక్షకులను కట్టి పడేసింది. హీరో తేజా సజ్జా తనకు అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. అదిరిపోయే రేంజ్లో నటించాడు. పూర్తి న్యాయం చేశాడు. దీంతో అన్ని ప్రాంతాల ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు.
సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ వంటి పెద్ద స్టార్ల సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని మరీ హనుమాన్ సినిమా రాణిస్తోంది. ప్రతి 15 నిమిషాలకు ఓ మంచి ట్విస్టుతో అలరించే హనుమాన్కు విశేష ఆదరణ లభిస్తోంది. సినిమాకు అందించిన గ్రాఫిక్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. హీరోతో పాటు హీరో సోదరి పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అదరహో అనిపించింది. విలన్లు వినయ్ రాజ్, దీపక్ శెట్టి అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్, సత్యలు కామెడీ బాగా పండించారు. ఇలా అన్ని క్యారెక్టర్లు ప్రేక్షకులను అలరించాయి
ప్రస్తుతం 100 కోట్ల మార్కును దాటిన హనుమాన్ రానున్న రోజుల్లో మరింత దూకుడు ప్రదర్శించనున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ కోసం మరికొన్ని థియేటర్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.