Vyooham: ఎన్నెన్నో జీవితాలు, ఎన్నో దారులు, మరెన్నో మలుపులు.. అనే క్యాప్షన్ తో ఆంధ్రప్రదేశ్ లోని ఎర్రసముద్రం ప్రాంతంలో గర్భంతో ఉన్న తన భార్య ముత్యాలును ఆసుపత్రికి తీసుకెళ్తుంటాడు రాముల. పెయిన్స్ తో బాధపడుతున్న తన భార్యకు ధైర్యం చెబుతూ హైవే ఎక్కగానే ఒక కారు తను నడుపుతున్న అంబులెన్స్ ను ఢీ కొడుతుంది. తను వ్యాన్ నుంచి బయటకు వచ్చి తన భార్యను కాళ్లమీద పడుకోబెట్టుకొని నీకేమి కాదని చెబుతూ.. యాక్సిడెంట్ చేసిన కారు అక్కడే ఉంటే హాస్పటల్ కు తీసుకుపోవడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. వీళ్లను పట్టించుకోకుండా కారు వెళ్లిపోతుంది. తను ఏడుస్తుంటాడు. అంతలో ముత్యాలు చనిపోతుంది. రాములా ఏడుస్తాడు. సమాజంలో జరుగుతున్న అనేక నేరలు పిన్ చేసున్న బోర్డుపై టైటిల్స్ పడుతుంటాయి. 5 సంవత్సరాల తరువాత అని పడుతుంది. అర్జున్ బీచ్ లో కూర్చొని సముద్రాన్ని చూస్తూ.. తన అమ్మతో ఉన్న రోజులను గుర్తుకు చేసుకుంటాడు. అమ్మ భయపడకు అని అంటుంది. చిన్నప్పుడు వాళ్ల అమ్మ పక్కనే ఉండి తనను సముద్రంలో ఈదడాని వెళ్లమంటుంది. అదే సమయంలో తనను ఎవరో కాల్చి చంపేస్తారు. చనిపోయే ముందు భయపడకు అని చెప్తుంది. అది తలుచుకొని అర్జున్ ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. బెడ్ నుంచి లేచి వాళ్ల అమ్మ డ్రెస్ ను, ఫోటోను చూస్తాడు.
చదవండి:Guntur Kaaram: ఓవర్సీస్లో గుంటూరు కారం ర్యాంపేజ్!
ఫిబ్రవరి 17 హైదరాబాద్ లో మైకల్ తన ఫ్లాట్ లో డ్రాయింగ్ వేసుకుంటూ ప్రెగ్నెంట్ తో ఉన్న తన వైఫ్ జెస్సిని ఏం పనులు చేయకు అని చెప్తాడు. తరువాత ప్రవీణ్ కు ఫోన్ చేసి జెస్సీని హాస్పటల్ కు చెక్ అప్ కోసం తీసుకెళ్తున్నా ఒక 2 హవర్స్ మ్యానేజ్ చేయమంటాడు. క్యాబ్ లు అవైలబుల్ గా ఉండవు. దాంతో ఫ్రెండ్స్ కారు కోసం ట్రై చేస్తా అని మైకల్ అంటాడు. నేను జస్ట్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంటే, బైక్ పైన వెళ్లొచ్చు అని జెస్సీ అంటుంది. రిస్క్ వద్దు అన్నా వినకుండా మైకల్ ను ఫోర్స్ చేసి బైక్ పై హాస్పటల్ కు బయలు దేరుతారు. దారి మధ్యలో రాముల పోలీసులకు ఏదో యాక్సిడెంట్ గురించి చెప్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతో వేరే రూట్ నుంచి వెళ్దామని జెస్సీ అంటే మైకల్ బైక్ వేరే రోడ్డుమీదగా తీసుకెళ్తాడు. తనను తీసుకొని వెళ్తుంటే ఇంకో చోట ట్రాఫిక్ హెవిగా ఉంటుంది. అదే సమయంలో ఒక బైక్ మైకల్ ను డ్యాష్ ఇవ్వబోతుంది. రాంగ్ రూట్ లో వచ్చావు అని మైకల్ వాల్లను తిడుతుంటే.. ఎమర్జెన్సీ అని దారి ఇవ్వండి అని బైక్ లో ఉన్న ముగ్గురు వెనక్కి వెళ్తుంటారు. ఈ రోజు చాలా ట్రాఫిక్ ఉందని మైకల్, జెస్సీ మాట్లాడుకుంటారు. ట్రాఫిక్ క్లియర్ అవగానే మైకల్ బైక్ డ్రైవ్ చేస్తుంటే మరో బైక్ వాళ్లకు అడ్డం వస్తుంది. దాంతో జెస్సీ కంగారుపడుతుంది.
అలా బైక్ వెళ్తుంటే.. ఈ రోజు అన్ని ఇలా జరుగుతున్నాయి అని మాట్లాడుకుంటారు. రోడ్డు మీద ఒక జంట వెళ్తుంటారు. అమ్మాయి కొంచెం కంగారుగా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ ను గట్టిగా పట్టుకుంటుంది. వాళ్లను చూసి కాలేజీ డేస్ గుర్తుకు వచ్చాయని మైకల్, జెస్సీ మాట్లాడుకుంటారు. అదే సమయంలో ఆ కపుల్స్ ఒక్కసారిగా వీళ్లముందు నుంచి యూటర్న్ తీసుకుంటారు. దాంతో మైకల్ బైక్ మళ్లీ కంట్రోల్ తప్పుతుంది. వెంటనే బైక్ రోడ్డు మీద ఆపీ మార్నింగ్ నుంచి జరిగిన ఇన్సిడెంట్లను గుర్తు చేసుకుంటాడు. ఆ రోడ్డు పక్కన కాసేపు ఆపు అని తన వైఫ్ చెప్తుంది. సరే అని ముందుకు వెళ్లగానే ఒక కారు వచ్చి బైక్ ను ఫోర్స్ గా ఢీ కొడుతుంది. మైకల్, జెస్సి ఇద్దరు గాళ్లో ఎగిరి కింద పడుతారు. కట్ చేస్తే మైకల్ జెస్సిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. జెస్సీకి చాలా దెబ్బలు తాకుతాయి. బ్లీడింగ్ అవుతుంది. బేబీ చనిపోయిందని డాక్టర్స్ చెప్తారు.
తరువాత తన ఫ్రెండ్ మాట్లాడానికి చూస్తే మైకల్ ఏం మాట్లాడడు. అదే సమయంలో ఎక్వైరీ కోసం పోలీసులు వచ్చారని వాళ్లతో మాట్లాడుతుంటాడు. అక్కడికి జెస్సీ పేరెంట్స్ వస్తారు. ఏం జరిగిందని ప్రవీణ్ ను అడుగుతారు. మరో సీన్లో అర్జున్ కార్లో వెళ్తుంటే వాళ్ల అమ్మ కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తననను నక్సల్స్ కాల్చేశారని మాట్లాడుకుంటారు. తరువాత స్టేషన్ కు వెళ్లి అందరిని పరిచయం చేసుకొని తన టేబుల్ మీద కూర్చుంటాడు. చార్జ్ తీసుకున్నందుకు స్వీట్స్ ఇస్తారు. తరువాత జర్నలిస్ట్ తో మాట్లాడుతుంటాడు. ఇంటర్వ్యూ కావాలంటే మరో రోజు చూద్దామని చెప్పి పంపిస్తాడు. తరువవాత కానిస్టేబుల్ జీవన్ వచ్చి సెల్యూట్ చేస్తాడు. స్వీట్ తీసుకొ అని స్టేషన్ వాళ్ల గురించి చెప్పు అని చెప్తాడు. ఈ స్టేషన్ లో అందరూ మంచోల్లే, ఇక్కడ డ్యూటీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. దాంతో వాళ్లేంటి నీ గురించి బ్యాడ్ గా చెప్పారు. లంచాలు తీసుకుంటావట, ఇంకా చాలా చేస్తావా అట అని అర్జున్ అంటాడు. అసులు ఈ స్టేషన్ లో అందురు దొంగలే సర్, వాల్లే లంచాలు తీసుకుంటారు అని వాళ్ల గురించి నిజాలు చెప్తాడు జీవన్. అదే సమయంలో అక్కడికి ఒక అతను వచ్చి అమృత మేడమ్ బొకే పంపించినట్లు చెప్పి అక్కడ పెట్టి వెళ్తాడు. థ్యాంక్యూ అమృత అని టైప్ చేసి తరువాత మేడమ్ అని మెసేజ్ చేస్తాడు. తరువాత జీవన్ స్వీట్ బాక్స్ ను తీసుకొని అందరికి ఇవ్వమని చెప్తాడు.
నెక్ట్స్ సీన్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అనే టైటిల్ పడుతుంది. పవన్ ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ వచ్చిందని ఆఫీసర్ యుగేంధర్ చెప్తాడు. దానికి మీరే కొంచెం ఆలోచించాలి సర్ అని పవన్ అంటాడు. తరువాత ఒక యాక్సిడెంట్ కేసులో ఎక్వైరీ ఉందని క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడాలి అని పవన్ అంటాడు. కొంచెం బయట మాట్లాడుదామని ఆఫీసర్ చెప్తాడు. అప్పుడు క్యాబ్ లో బాంబ్ ఉంది, దాన్ని సిటీ బయటకు తీసుకెళ్లే తొందరలో యాక్సిడెంట్ జరిగిందిని యుగేంధర్ చెప్తాడు. టాస్క్ ఫోర్స్ ఎమర్జెన్సీ వలనే యాక్సిడెంట్ జరిగిందని కేసును క్లోజ్ చేయి అంటాడు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిందని పవన్ చెప్పడంతో.. ఎలాగో అలా కేసు క్లోజ్ చేయి నీ ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ ను నేను చూసుకుంటా అంటాడు. సరే అని పవన్ వెళ్తాడు.
మరో సీన్లో మైకల్ ఐసీయు బయటనుంచి చూస్తుంటాడు. తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తన చేతులో ఉన్న గవ్వలతో చేసిన బ్రేస్ లెట్ ను చూస్తాడు. అది జెస్సీకి గిఫ్ట్ ఇచ్చిన జ్ఙాపకాలను గుర్తు చేసుకుంటాడు. మైకల్ కు ఫోన్ వస్తుంది. కట్ చేస్తే కేసును క్లోజ్ చేసినట్లు పవన్ చెప్తాడు. అలా ఎలా క్లోజ్ చేస్తారు సర్, నా లాస్ గురించి ఎవరు పట్టించుకోరా అని మైకల్ అడుగుతాడు. తాము గవర్నమెంట్ కు ఎగనెస్ట్ గా వెళ్లలేము, కావాలంటే కాంపన్సేషన్ ఇప్పించగలం అంటాడు. మైకల్ అలానే చూస్తాడు. ఫైల్ తీసుకురా అని ఎస్ఐ పవన్ అంటాడు. మైకల్ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో పొలిటకల్ లీడర్ రెడ్డన్నతో మాట్లాడానికి మైకల్ వెళ్తాడు. యాక్సిడెంట్ విషయం నువ్వు చేసేంత వరకు నాకు తెలియదు తమ్ముడు, తెలిస్తే వచ్చేవాడిని, పోయిన నెల నిహరిక మీద ఎవడో ఎటాక్ చేశాడు అని అలా కూర్చో మాట్లాడుదాం అంటాడు. జెస్సీ కోమాలకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఆ పోలీసులు ఆ కేసును సరిగ్గా చూడడం లేదు, నీకు తెలిసిన పెద్ద ఆఫీసర్లతో ఆ కేసును డీల్ చేయమని చెప్తావా అన్నా అని మైకల్ అడుగుతాడు. దానికి అతను ఫోన్ చేస్తాడు.
కట్ చేస్తే అర్జున్ టెన్నీస్ ఆడిటోరియల్ లో గేమ్ చూస్తుంటాడు. అక్కడికి వచ్చిన సీనియర్ ఆఫీసర్ ప్రజ్వల్ తనకు తెలిసిన వాళ్లకు యాక్సిడెంట్ అయిందని, అది నీ స్టేషన్ లో ఎవరో ఆ కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారని చెప్తాడు. ఒకే సర్ నేను చూసుకుంటా అని అర్జున్ అంటాడు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో క్యాబ్ డ్రైవర్ తో పోలీసు మాట్లాడుతుంటాడు. ఇంకా నా వల్ల అవట్లేదు, దానికి మా ఓనర్ కూడా ఒప్పుకోవట్లేదని చెప్తాడు. తరువాత తన అకౌంట్లో పదివేలు వేయమని చెప్పి పంపిస్తాడు. అక్కడే మైకల్ వెయిట్ చేస్తుంటారు. చాలా సేపు స్టేషన్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు.
తరువాత హైదరాబాద్ లోని సీటీ అవుట్ స్కర్ట్స్ దగ్గర ముగ్గురు ఒక కన్ స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో ఉంటారు. తరువాత సీన్లో మైకల్ ఆలోచిస్తుంటాడు. వాళ్లు ఎలా ఉంటారో తెలియదు ఎవరి మీద కేసుపెడుతావు అని పోలీసులు అన్న మాటలు గుర్తుకు వస్తాయి. తరువాత అక్కడినుంచి లేచి డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తాడు. నెక్ట్స్ సీన్లో అర్జున్ ఫాదర్ టీవీ చూస్తుంటాడు. జర్నలిస్ట్ నిర్మాల కేసుగురించి మీడియ పర్సన్ ప్రజ్వల్ ను క్వశ్చన్స్ అడుగుతుంది. అక్కడికి వచ్చిన అర్జున్ ప్రజ్వల్ సర్ ఏదైనా టేక్ అప్ చేస్తే చాలా ఫర్ఫెక్ట్ గా చేస్తాడు అంటాడు. దానికి వాళ్ల ఫాదర్.. అన్ని సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు, అన్నిట్లో ఫర్ఫెక్ట్ గా ఉండే నీలాంటి వాడినే కొన్ని సార్లు సిచ్యువేషన్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి అంటాడు.
తరువాత సీన్లో మైకల్ పోలీసుల మీద అరుస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి అర్జున్ వస్తాడు. విషయం ఏంటని మైకల్ ను అడుగుతాడు. తన కేసు ఫైల్ తీసుకొని ఆ రోజు రోడ్డుమీద బైక్ ఎందుకు ఆపావు అంటాడు. తనకు మూడు యాక్సిడెంట్లు జరగబోయాయి అని అతను గీసిన స్కెచ్ లు ఇస్తాడు. అవి అన్ని చూసిన అర్జున్ మైకల్ వైపు చూస్తాడు. మైకల్ సిరీయస్ గా ఉంటాడు. అందులో ఒక ఫోటోను చూస్తాడు అర్జున్. ఒక బైక్ పై అతను గన్ పట్టుకొని త్వరగా వెళ్లనీవు అని చెప్తుంటాడు. దారిలో మైకల్ టచ్ అవుతాడు. తాను అలా ముందుకు వెళ్లి ఒక్ ఇసుక కుప్పలోకి బైక్ ను పోనిచ్చి ఆ గన్ పట్టుకొని తన హెల్మెంట్ తీస్తాడు అర్జున్. దాన్ని గుర్తు తెచ్చుకొని మైకల్ వైపు చూస్తూ ఉంటాడు.
నెక్ట్స్ సీన్లో ఒక జలాల్ తనతో ఉన్న మిగితా వారికి ఏదో చెప్తుంటాడు. వారికి గన్స్ చూపిస్తాడు. మనం కచ్చితంగా ఈ పని చేస్తాము అని చెప్తాడు. తరువాత పోలీసు సేఫ్ హౌస్ దాని కోడ్ నేమ్ తాజ్ మహాల్ అని టైటిల్ పడుతుంది. అక్కడికి ఒక ఆఫీసర్ వస్తాడు. అక్కడికి అర్జున్ కూడా వస్తాడు. వీడు ఏమైనా చెప్పాడా అడిగితే లేదు అంటారు. ఓల్డ్ సిటీలో గన్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావ్, ఎవరిని చంపాలని అని అర్జున్ సిరీయస్ గా అడుగుతాడు, అతని గొంతుపట్టుకొని అడుగినా తన గురించి ఏం చెప్పడు. దాంతో కోపంతో అర్జున్ బయటకు వస్తాడు. వాడి వలన నా ఫస్ట్ కేసులో నేనే అక్యూస్డ్ అయ్యాను అని ఆఫీసర్ తో చెప్తాడు. వాడెవడో చెప్పెంతవరకు వాడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు.
మరో సీన్లో మైకల్ ఆసుపత్రికి వస్తూ.. తనకు పిల్లలు పుట్టరు అన్న విషయం గుర్తుకు వచ్చి బాధ పడుతుంటాడు. తరువాత ఐసీయూలో తనను చూసి వాళ్లకు బేబీ పుడితే ఎలిజబెత్, అబ్బాయి పుడితే అలెగ్జాండర్ అనే పేర్లు పెడుతా అంటాడు. జెస్సీ తనను ప్రేమతో ముద్దుపెడుతుంది. జీవన్ టిఫిన్ చేస్తుంటే అర్జున్ కాల్ చేసి మైకల్ యాక్సిడెంట్ సీసీ ఫుటేజ్ తీసుకురా అని చెప్తాడు. అర్జున్ ఆఫీస్ లో ఫైల్ చూస్తుంటాడు. ఒక వైట్ కలర్ కారు వచ్చి యాక్సిడెంట్ చేసిందని, ఆ కారు నెంబర్ 3646 అని చెప్తాడు. అర్జున్ అలోచనలో పడుతాడు. తాను ఇంట్లో ఫేస్ వాష్ చేసుకుంటుంటే అదే నెంబర్ కార్లో ఉన్న బాంబును సిటీ దాటించారని, ఈ ఘనటలో పోలీసుల కాల్పులో చనిపోయిన వారి గురించి టీవీలో చెప్తుంటారు. అది గుర్తువచ్చి బోర్డు మీద నోట్ చేస్తాడు. తరువాత పవన్ కు ఫోన్ చేస్తాడు. మైకల్ కేసు ఏమైందని, టాస్క్ ఆఫీసర్ తో మాట్లాడావా అని అడుగుతాడు. క్యాబ్ డ్రైవర్ ను నా ముందుకు ఒక సారి తీసుకురా అని చెప్తాడు. దాంతో పవన్ యుగేంధర్ కు కాల్ చేస్తాడు.
మరో సీన్లో మైకల్ యాక్సిడెంట్ అయిన ఫుటేజ్ ను తెప్పించుకొని చూస్తుంటే జీవన్ వస్తాడు. అతను చూస్తుంటే అతని మీద అర్జున్ అరుస్తాడు. అతను వెళ్లిపోతాడు. మళ్లీ ఫుటేజ్ ను చూస్తాడు. ఈ కెమెరాలో విజువల్స్ కరెక్ట్ గా లేవని జీవన్ ను పిలుస్తాడు. లంచ్ చేస్తున్న జీవన్ చిరాకు గా వస్తే.. వేరే ఫుటేజ్ కావాలని అడుగుతాడు. జీవన్ సరే అంటూ వెళ్లబోతుంటే తినేసి వెళ్లు అని చెప్తాడు అర్జున్ . తరువాత రాముల ఎస్ఐ శణ్ముకం సర్ గురించి వెయిట్ చేస్తాడు. అర్జున్ చూసి విషయం ఏంటని కనుక్కుంటాడు. అదే సమయంలో శణ్ముకం వస్తాడు. రాముల చేతులో డబ్బులు చూసి శణ్ముకంపై అర్జున్ కు కోపం వస్తుంది. తరువాత సంతకం పెట్టి స్టాంప్ వేసి పంపు అని చెప్పి, టాస్క్ ఫోర్స్ తో మాట్లాడిన ఫైల్స్ తీసుకొని రా అని చెప్తాడు.
తరువాత సీన్లో అర్జున్ తన ఫ్రెండ్ పోలీసు ఆఫీసర్ మిశాంత్ ను కలువడానికి పోలో గేమ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ తో ఆ రోజు కార్లో బాంబు ఇన్ఫర్మేషన్ మన డిపార్ట్ మెంట్ లో ఎవరి దగ్గర ఉందో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్తాడు. సరే అంటాడు మిశాంత్.
తరువాత సీన్లో ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడకి జలాల్, ఇంకో పర్సన్ వచ్చి కూర్చుంటారు. అక్కడే అక్బర్ కూడా ఉంటాడు. నెక్ట్స్ సీన్లో మిశాంత్ అర్జున్ కు కాల్ చేసి టాస్క్ ఫోర్స్ వాళ్లకు బాంబు గురించి ఏ లీడ్ ఇవ్వలేదు అంటాడు. అలాంటప్పుడు ఐబీ లీడ్ అని ఎందుకు రాశారు అని అర్జున్ ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో వేరే యాంగిల్ నుంచి ఫుటేజ్ దొరికిందని జీవన్ చెప్తాడు. ఓపెన్ చేసి చూస్తే అక్కడ మోహన కాకుండా వేరే క్యాబ్ డ్రైవర్ ఉంటాడు. మరో సీన్లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సైట్ ఓపెన్ చేసి క్యాబ్ డ్రైవర్, యుగేంధర్ ఫ్రొఫైల్స్ ను ఒకడు ప్రింట్ తీసుకుంటాడు.
నెక్ట్స్ సీన్లో బ్లడ్ తో ఉన్న కత్తి, సిగరేట్ లను రికవరీ చేస్తుంటారు. అక్కడ డ్రమ్ లో బాడీ ఉంటుంది. మర్డర్ జరిగినట్లు పోలీసు చెప్తాడు. తన పై ఆఫీసర్ కాల్ చేస్తే ఇప్పుడే మర్డర్ జరిగిన చోటును పరిశీలించినట్లు చెప్తాడు. తరువాత 5 సంవత్సరాలుగా ఒక్కడే ఉంటున్నాడా అని, ఇతను చూడడానికి సౌమ్యంగా ఉన్నాడు ఎవరు చంపుంటారు అని ఆలోచిస్తాడు. తరువాత స్టేషన్లో గౌతమ్ ను పలిపించి మాట్లాడుతాడు. తాను రైటర్ అని చెప్తాడు. అలాంటప్పడు నీ చేతులో గన్ ఎందుకుంది అని అర్జున్ అడుగుతాడు. అప్పుడు నిహారికా తాను ప్రేమించుకుంటున్నారని చెప్తాడు. వాళ్ల నాన్న తనకు వేరే సంబంధం చూస్తే… ఇద్దరికి తెలిసిన రాంజీ అనే వ్యక్తిని పిలిచి హెల్ప్ అడుగుతుంది నిహారికా. అతను ఇద్దరు పెళ్లి చేసుకుంటే సమస్య తీరుతుంది అని చెప్తాడు. నెక్ట్స్ డే నిహాను కార్లో ఎక్కించుకొని రాంజీ వెళ్తాడు. గౌతమ్ తన ఫ్రెండ్ చాలా సేపు వెయిట్ చేసి రాంజీ రూమ్ కు వెళ్తారు. అక్కడకు రాలేదని అతని పేరు సత్యమూర్తి అని ఓనర్ చెప్తాడు. అతను కార్తిక్ వాళ్ల బాబాయ్ అంటాడు. అక్కడినుంచి వాల్లు రెగ్యూలర్ గా తిరిగే అన్ని ప్లేస్ లలో తిరుగుతారు. నిహ కనిపించదు. మళ్లీ తన రూమ్ దగ్గరకే వస్తే ఓనర్ ఇంకా రాలేదని చెప్తాడు. కీస్ ఇవ్వరా అంటే కదురదు అంటాడు. దాంతో గౌతమ్ ఇంట్లోకి వెళ్లి అన్ని చెక్ చేస్తుంటాడు. ఓనర్ కీస్ తీసుకొని డోర్ తీస్తాడు. అదే సమయంలో డ్రమ్ ఓ కార్తిక్ బాడీ కనిపిస్తుంది. కట్ చేస్తే అక్కడికి పోలీసులు వస్తారు. నిహరికా గురించి అడిగితే వాళ్ల నాన్న రెడ్డన్న అని చెప్తాడు. దాంతో ఎస్ఐ రెడ్డన్నకు కాల్ చేసి విషయం చెప్తాడు. అది విని గౌతమ్ తన ఫ్రెండ్స్ పారిపోతారు. ఫోటోల్లో ఉన్నారేమో అని కెమెరా చూసి ఫోటోలను షేర్ అంటాడు.
తరువాత నిహ ఉన్న క్యాబ్ ను ట్రాక్ చేయమని తన ఫ్రెండ్ కు చెప్తాడు. ఆ ఇన్ఫార్మేషన్తో గౌతమ్ నైట్ టైమ్ లో నేహ కోసం బయలుదేరుతాడు. కారు అడవిప్రాంతంలో దొరుకుతుంది. కార్లో ఇంజక్షన్లు, తన గాజులు కనిపిస్తాయి. నెక్ట్స్ గౌతమ్ బార్లో కూర్చొని ఉండగా పక్కన ఇక ఆసుపత్రి ఉందని బేరర్ చెప్తాడు. దాంతో గౌతమ్ ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ నిహా కనిపిస్తుంది. తనను మత్తునుంచి లేపి హగ్ చేసుకొని, పక్కనే ఉన్న గన్ తీసుకొని ఆలోచిస్తాడు. రాంజీ నిహాకు మత్తు ఇచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. తరువాత నిహాను తీసుకొని గౌతమ్ వెల్లిపోతాడు. అదే సమయంలో రాంజీ అంబులెన్స్ లో వాళ్ల వెంటపడుతాడు. అలా వాళ్లు సిటీలోకి ఎంటర్ అవుతారు. వాళ్ల వెనుకాలే రాంజీ ఫాలో అవుతాడు. అతన్ని కన్ ఫ్యూజ్ చేయడానికే అక్కడ యూ టర్న్ తీసుకున్నట్లు, పోలీసులను చూసి అతన్ని గన్ తో బెదిరించినట్లు చెప్తాడు. తరువాత రాంజీ కనిపించలేదు అంటాడు. బోర్డు మీద రాంజీ పేరు రాస్తాడు అర్జున్.
నెక్ట్స్ జలాల్ ఫైల్ తీసుకొని ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్నవారికి గన్ ఫైరింగ్ గురించి చెప్తుంటాడు. అక్కడ ఇబ్రాన్ ను పిలిచి యుగేంధర్ ఫోటో ఇచ్చి ఇతనే నీ అన్నను చంపింది అని చెప్తాడు. ఇబ్రాన్ ఫోటోను చూస్తూ ఉంటాడు.
మరో సీన్లో యుగేంధర్ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే కొందరు అతన్ని కిడ్నాప్ చేస్తారు. నెక్ట్స్ సీన్లో మైకల్ హస్పటల్ వస్తాడు. జెస్సీని చెన్నైకి షిఫ్ట్ చేస్తారట అని అంటాడు. ఈ కండిషన్లో ఎలా అని.. నిన్ను చేసుకోవడం వలనే ఇదంతా అని మైకల్ గల్ల పట్టుకుంటాడు జెస్సీ ఫాదర్. మైకల్ సైలెంట్ గా వచ్చి కూర్చుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో జెస్సిని అడగడానికి మైకల్ వెళ్లినప్పుడు మైకల్ నాన్న లంచం తీసుకోవడం గురించి చెప్పి, ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదని జెస్సీ నాన్న చెప్తాడు. దాంతో మైకల్ వెళ్లిపోతాడు. తరువాత ల్యాబ్ లో తన ప్రయోగం సక్సెస్ అయిందని సంతోషపడుతుంటాడు. అదే సమయంలో జెస్సీ ఫోన్ చేస్తే కట్ చేస్తాడు. తరువాత అక్కడికి జెస్సి వచ్చి పెళ్లి చేసుకుందామని చెప్తుంది. ఇదే విషయాన్ని మైకల్ ఆలోచిస్తాడు.
తరువాత సీన్లో ఆఫీసర్ నందకిశోర్ తో సిటీకి ముగ్గురు టెర్రరిస్ట్ లు వచ్చారని, నాకు కొంచెం హెల్ప్ చేస్తే దీన్ని సార్ట్ అవుట్ చేస్తా అంటాడు. కానీ ఆఫీసర్ ఒప్పుకోడు. అక్కడినుంచే వెళ్లిపోతాడు. తరువాత తన చెల్లెలు సర్ ప్రైజ్ అంటూ డిన్నర్ కు తీసుకెళ్తుంది. అక్కడ అమృత పేరెంట్స్ కూడా ఉంటారు. డిన్నర్ చేస్తుంటే ఐపీఎస్ ఎందుకు, రిస్క్ జాబ్ కదా అని అమృత ఫాదర్ అంటాడు. వాళ్ల అమ్మను నక్సల్స్ కళ్లముందే చంపారు అని ఈ సిస్టం ఇప్పటి వరకు పట్టుకోలేదని, ఈ మొత్తం సిస్టాన్ని కరెక్ట్ చేయాలి అంటాడు. నీ బాధ నాకు తెలుసు అని అమృత ఫాదర్ అంటాడు. మీకు తెలియదు, అప్పుడు మా చెల్లెకు 5 సంవత్సరాలు, తన గురించి ఆలోచించని రోజు లేదని అక్కడినుంచి అర్జున్ వెళ్లిపోతాడు. తరువాత తన మదర్ ఇంటర్వ్యూ పెట్టుకొని చూస్తుంటాడు.
సోసైటీకి కనెక్ట్ అయ్యే సర్వీస్ పోలీసులు జాబ్ అని, క్రిమినెల్స్ కూడా మనలాంటి వాళ్లే అని చెప్తుంది వీణ. అది చూసి అర్జున్ మోటివేట్ అవుతాడు. తరువాత సీన్లో దీక్షిత్ ను కలువడానికి పోలీసు వస్తాడు. ఈ స్టేట్ మెంట్ కరెక్ట్ గా లేదని అంటాడు. తాను వాళ్ల అమ్మాయి నిర్మల భోజనం చేస్తుంటే కొంతమంది వచ్చి తనను చంపినట్లు చెప్తాడు. వాళ్లను గుర్తుపట్టారా అంటే లేదని చెప్తాడు. లాస్ట్ వచ్చిన ఆఫీసర్ ఇతనేనా అని చెప్తాడు. అవును అంటాడు. తరువాత భరత్ ఫింగర్ ప్రింట్ మ్యానుప్లేట్ చేసినట్లు తెలుసుకుంటాడు. తరువాత అందులో ఒకడిపేరు కిట్టు అని దీక్షితులు చెప్తాడు.
మరో సీన్లో కార్లో వెళ్తున్న ఇద్దరు.. చేయని మర్డర్ కు కేసు ఎలా ఫైల్ చేస్తారు అని మాట్లాడుకుంటారు. తరువాత ఫుడ్ కోసం ఆపినప్పుడు భరత్ తన స్టూడెంట్ ఐడీ కార్డును చూస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో భరత్ కాలేజీ డీన్ ను కలువడానికి వెళ్తాడు. తనకు యూరప్ లో టాప్ సైంటిస్ట్ దగ్గర రీసెర్చ్ చేయడానికి వెళ్లడానికి సీటు వచ్చినట్లు డీన్ చెప్తాడు. భరత్ చాలా సంతోషపడుతాడు. తరువాత తన ఫ్రెండ్ తో సంతోషంగా దాని గురించి చెప్తాడు. కాస్ట్ ఒకటే కాబట్టి నీకు సీటు వచ్చింది అని ఒకడు అంటాడు. దాంతో భరత్ కు కోపం వచ్చి అతన్ని కొడుతాడు. అక్కడికి డీన్ వచ్చి భరత్ ను వెళ్లిపో అంటాడు. సిగరేట్లు మానేశాడు కాబట్టి నికోట్రిప్స్ తీసుకుంటాడు భరత్. షాప్ లో అవితీసుకుంటుంటే అవి ఎక్స్ పైర్ అయ్యాయని వాటి స్థానంలో డ్రగ్స్ ఇస్తాడు షాపు అతను. అలా భరత్ కు డ్రగ్స్ అలవాటు అవుతాయి. దాని కోసం ఫ్రెండ్ పర్స్ లోంచి డబ్బులు కూడా తీస్తూ ఫ్రెండ్ తో గొడవ పడుతాడు. తరువాత షాప్ వాడు ఖాతా ఇవ్వను అంటుంటే అక్కడికి ఒకడు వచ్చి తనకు డ్రగ్స్ అలవాటు చేస్తాడు. దానితో చైన్ స్నాచింగ్స్ చేస్తుంటాడు. ఒక సారి చైన్ స్నాచింగ్ చేస్తుంటే పోలీసులకు దొరుకిపోతాడు. అదే కార్లో కూర్చొని గుర్తుకు చేసుకుంటే తన ఫ్రెండ్ ఫుడ్ తీసుకొని వస్తాడు.
మరో సీన్లో ఆశోక్ నగర్, ఆర్ఎస్ నగర్ రెండు క్రైమ్ సీన్స్ రిపోర్ట్స్ అని, రెండు హత్యలు చేసింది ఒక్కరే అది రాంజీ అని ఫైల్ ఇస్తాడు పోలీసు. దాంతో అర్జున్ జీవన్ ను తీసుకొని వెళ్తాడు. అక్కడ ఇంట్లో కేసు స్టడీ కోసం వెళ్తాడు. అదే సమయంలో జీవన్ తన ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతుంటాడు. వెంటనే గౌతమ్ కు ఫోన్ చేసి నిహారికా అడ్రస్ షేర్ చేయమని, కాన్ఫరెన్స్ కలుపమంంటాడు. నిహారికాను టెర్రస్ మీదకు రమ్మంటాడు. నిహా చేయి ఊపుతుంది. తరువాత రాంజీ కార్తిక్ ను చంపినట్లు ఆలోచిస్తాడు. కట్ చేస్తే రెడ్డన్నతో తన డాటర్ గురించి చెప్తాడు. రాంజీ ఫోట్ చూపించి ఇతన్ని ఎక్కడైనా చూశారా అని అంటాడు. రెడ్డన్న గ్యాంగ్ లో కొట్టు ఉంటాడు. రాంజీ ఏదో ఆలోచిస్తుంటాడు. అర్జున్ వెళ్లిపోతాడు.
తరువాత జీవన్ తో రెడ్డన్నకు, రాంజీకి ఏదైనా సంబంధం ఉందా కనుక్కో అంటాడు. జీవన్ వెళ్లగానే అమృత కాల్ చేసి నైట్ కలుద్దాం అంటుంది. తరువాత పవన్ కు కాల్ చేసి ట్యాక్సీ డ్రైవర్ ను తీసుకు రమ్మాన్నాను కదా ఏం అయిందని చెప్తాడు. తరువాత టాస్క్ ఫోర్స్ మోహన్ ఇంటి అడ్రస్ కనుక్కోండి అని చెప్తాడు. అదే సమయంలో మోహన్ చనిపోయినట్లు చెప్తాడు. దాంతో అర్జున్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడ యుగేంధర్ భార్య తను రెండు రోజుల నుంచి ఇంటికి రావట్లేదని ఏడుస్తుంది. తరువాత నందకిశోర్ తో టెర్రరిస్ట్ లకు హెల్ప్ చేసింది యుగేంధర్ అని చెప్తాడు. మోహాన్ ను కూడా అతనే చంపాడని తన డౌట్ అని చెప్తాడు. నందకిశోర్ ఫైర్ అవుతాడు. ఏ ప్రూఫ్ లేకుండా టాస్క్ ఫోర్స్ సీఐని ఎంక్వైరీ చేయలేము అని అంటాడు. ప్రూఫ్స్ తో వస్తా అని చెప్పి వెళ్లిపోతాడు.
తరువాత జెస్సీని చెన్నైకి తీసుకెళ్తుంటారు. అదే సమయంలో అమృత, అర్జున్ బైక్ రైడ్ లో వెళ్తుంటారు. వాళ్ల మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటారు. తరువాత సీన్లో నాకు ఏం తెలియదు అని యుగేంధర్ ఏడుస్తుంటాడు. కిడ్నాపర్స్ తనను కాల్చి చంపేస్తారు.
తూఫ్రాన్ పోలీసు స్టేషన్లో అర్జున్ పోలీసులతో మాట్లాడుతుంటారు. యుగేంధర్ చనిపోయినట్లు స్టేషన్ పోలీసులు చెప్తారు. తరువాత అర్జున్ పవన్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావు, తమ్ముడికి బాగా అయిందా అని మాట్లాడుతాడు. లేదు సర్ ఇంకా బాగ అవలేదు పుత్తురుకు తీసుకెళ్తున్నా అని చెప్తాడు. దాంతో ఇతనేనా నీ తమ్ముడు అని వీడియో కాల్లో అతన్ని తమ్మున్ని చూపిస్తాడు. పవన్ షాక్ అవుతాడు. ఇప్పుడు నిజం చెప్పు, మెహాన్, యుగేంధర్ల మర్డర్లకు నీకు ఏంటి లింక్ అని చెప్తాడు. యుగేంధర్ చనిపోయినట్లు అతనికేమి తెలియదు అని చెప్తాడు. దాంతో పవన్ ను 3 నెలలు సస్పెండ్ చేస్తాడు అర్జున్.
చెన్నై అని టైటిల్ పడుతుంది. మైకల్ పరుగెత్తుకుంటూ ఆసుపత్రికి వస్తాడు. జెస్సీ అలాగే చూస్తుంది. ఏంటని అడిగితే తాను గతం మరిచిపోయినట్లు డాక్టర్ చెప్తాడు. బ్రైన్ కు సర్జరీ అయిందని ఇలాంటివి సాధారణం అని తనతోనే ఉండి గతం గుర్తు చేస్తూ ఉండూ అని డాక్టర్ చెప్తాడు.
తరువాత సీన్లో రాముల క్యాబ్ ను వదిలేసి ఊరుకు వెళ్తున్నట్లు చెప్తాడు. అయిపోయిందేది అయిపోయింది అంటే లేదు అన్న ఊరుకెళ్లి అంబులెన్స్ నడుపుకుంటా అని వెళ్లిపోతాడు. మరో సీన్లో రాంజీ గురించి కొన్ని డిటైల్స్ ను అర్జున్ కు చెప్తాడు. రాంజీకి రాయలసీమలో ఎవరో ఉన్నారు అని చెప్తాడు. దాంతో రాంజీ పోస్టర్స్ వేయించి గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ దొరికిందని పేపర్ యాడ్ వేయించు రాంజీ బయటకు వస్తాడు అని చెప్తాడు.
తరువాత జర్నలిస్ట్ నిర్మాల మర్డర్ గురించి వార్త చదివితే కట్టేసిన వ్యక్తి లేచి చూస్తాడు. నిర్మాల తనను నక్సలిజమ్ వదిలేయమని చెప్పిన సంఘటన గుర్తు చేసుకుంటాడు. తరువాత కొన్ని ఫోటోలను పేపర్లో పెట్టి అందరికి పంచమని పోలీసు చెప్తాడు. తరువాత సీన్లో అబ్రాన్ దగ్గరకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనితో పని చేయండి అని చెప్తాడు. తనకు సెక్యూరిటీ సిస్టమ్ గురించి చెప్తాడు.
మరో వైపు అర్జున్ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తుంటాడు. అక్కడ అక్బర్ కనిపిస్తాడు. కట్ చేస్తే ఒక అతన్ని తీసుకొని మర్డర్ అటప్ట్ అని అర్జున్ అక్బర్ స్టేషన్ కు తీసుకొస్తాడు. అతనితో అక్బర్ మాట్లాడుతాడు. అమ్మాయిని చంపే ప్రయత్నం చేశావా అంటే లేదు అంటాడు. తరువాత తన నోటికి ఉన్న బ్లడ్ చూసి ఎందుకు కొట్టావు అని, ఇలా చేస్తే నిన్ను బొక్కలో వెయ్యాల్సి ఉందని ట్రైనీలో ఉన్న అర్జున్ తో చెప్తాడు. తరువాత సీన్లో అక్బర్ తన బస్తీ వాళ్లతో జోకులు వేసుకుంటూ మాట్లాడుతారు. అది చూసి ఇది పోలీస్టేషన్ హా, ఇరానీ కేఫా అని మరో పోలీసు అంటాడు. తరువాత వారంత చాలా జోయల్ గా స్టేషన్ నుంచి వెళ్తారు. నైట్ కార్టన్ సెర్చ్ అని రాత్రి అంతా స్టేషన్ ను అర్జున్ చూసుకుంటాడు అని చెప్తాడు.
మరోసీన్లో అక్బర్ డిన్నర్ చేస్తూ.. మా మనిషి ఒకడు మీ స్టేషన్లో ఉన్నాడు వాన్ని విడిపించాలి అని చెప్తాడు. దానికి ఖర్చు అవుతుందంటే జాంగీర్ ను పిలిచి డబ్బులు చూపిస్తారు. మీ పని అయిపోయిన్టేల అని చెప్తాడు. అదే సమయంలో పోలీసులు వచ్చి అక్బర్ ను అరెస్ట్ చేస్తారు. అదే విషయాన్ని అర్జున్ గుర్తుచేసుకుంటాడు.
మరో సీన్లో రాంజీ హైదరాబాద్ వస్తాడు. అక్కడ ఆగి తన మిస్సింగ్ పోస్టర్ ను చూస్తాడు. నల్లకుంట పోలీస్టేషన్లో పోలీసులు మాట్లాడుకుంటారు. ఆ ఆఫీసర్ వెళ్లగానే జర్నలిస్ట్ నిర్మల కేసు ఫైల్ ను మరో పోలీసు చూస్తాడు. తరువాత టెర్రిరిస్ట్ గ్రూప్ లకు అక్బర్ హెల్ప్ చేసినట్లు అర్జున్ చెప్తాడు. అది ఒక పోలీసులు ఫోటో తీసుకుంటాడు.
మరో సీన్లో అక్బర్ జలల్ తో మాట్లాడాలని వెయిట్ చేస్తుంటాడు. అతను పట్టించుకోకుండా వెళ్తాడు. అతని ఆ ఫోటో అక్బర్ కు పంపించి కలువాలి అని మెసేజ్ ఇస్తాడు. తరువాత సీన్లో మరో ఆఫీసర్ అర్జున్ తో కేసు గురించి మాట్లాడుతాడు. తరువాత మైకల్, జెస్సీ చేయిపట్టుకుంటాడు. వాళ్లిద్దరు పెళ్లిచేసుకుంటారు. ఫ్లాట్ తీసుకొని హ్యప్పిగా ఉంటారు. చాలా సరదాగా ఉంటారు. గిఫ్ట్ ఇస్తుంటాడు. ఒక రోజు తను ఫ్రెగ్నెంట్ అని తెలుస్తుంది. హ్యాప్పిగా ఉంటారు. అక్కడికి నర్సు వచ్చి మైకల్ ను లేపుతుంది. తను వెళ్లే సమయంలో అతని చేయిపట్టుకొని అబ్ నార్మల్ అవుతుంది. డాక్టర్స్ చెక్ చేస్తారు.
తరువాత నిహారికాకు ఫోన్ వస్తుంది. తాను మాట్లాడుతుంటే రాంజీ బయట నుంచి చూస్తుంటాడు. తరువాత రోడ్లమీద వాహనాలను చెక్ చేస్తుంటే అక్బర్ తో ఉన్న వ్యక్తి అడ్రస్ దొరికింది అని చెప్పి అక్కడికి వెళ్తారు. బ్యాక్ అప్ చెప్పమని ఇంట్లోకి వెళ్లి సెర్చ్ చేస్తారు. అక్కడ కొంత మంది ఉంటారు. అక్కడికి అక్బర్ వస్తాడు. ఇంత ఈజీగా దొరుకుతావు అనుకోలేదు అని అర్జున్ అంటే ఫరే ఏ ఛేంజ్.. ఈ సారి నువ్వు నాకు దొరికావు అంటాడు అక్బర్. ఎస్ఐ రాజారామ్ గన్ అర్జున్ కు గురిపెడుతాడు. గన్ తీసుకుంటాడు. దీంతో వ్యూహం నాలుగు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. మిగితా నాలుగు ఎపిసోడ్స్ పార్ట్ 2 గా అందిస్తాము.