»Bjp Leader Kishan Reddy Is Angry With The Congress Party
Kishan Reddy: కాంగ్రెస్కు ముందుంది ముసళ్ల పండుగ
కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని ఈ సంఘటన చాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తం గర్వపడేలా ఆయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే కాంగ్రెస్ వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు.
BJP leader Kishan Reddy is angry with the Congress party
Kishan Reddy: కాంగ్రెస్(Congress) పార్టీ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. దేశం గర్వపడేలా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రామమందిరం వంటి ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని.. దీంతో ఆ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి అని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు.
జనవరి 22న జరిగే మహత్తర కార్యక్రమానికి ఆహ్వనం అందినా.. తాము అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇది కచ్చితంగా రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని అన్నారు. ఇదివరకు జీ20, పార్లమెంట్ అఖిలపక్షం, ఎన్నికల కమిషన్ సమావేశాలను కూడా కాంగ్రెస్ రాలేదని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇలాంటి బహిష్కరణలు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అని పేర్కొన్నారు.