»Maldives Maldives Association Asks Easemytrip To Open Flight Bookings
Maldives: విమాన బుకింగ్‌లు తెరవమని.. ఈజ్‌మైట్రిప్‌ను కోరిన మాల్దీవుల సంఘం
భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ నేతలు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ను కోరింది.
Maldives: భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈజ్‌మైట్రిప్ మాల్దీవులకు విమాన బుకింగ్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం స్పందించింది. తమ నేతలు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ను కోరింది. ఆ మాటలు మాల్దీవుల ప్రజల అభిప్రాయం కాదని తెలిపింది. ఈజ్‌మైట్రిప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, తమ దేశానికి విమాన బుకింగ్‌లను తెరవాలని మటాటో లేఖ రాసింది.
రెండు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని, భారతీయులను సొంతవారిగా భావిస్తామని వెల్లడించింది. పర్యాటక రంగంలో భారతీయులు అత్యంత కీలకమని తెలిపింది. ఈ నేతల వ్యాఖ్యలను ఆ దేశ పర్యాటక పరిశ్రమం ఖండించిన సంగతి తెలిసిందే. కొవిడ్ తర్వాత మాల్దీవులు కోల్కోవడానికి భారత దేశం ఎంతో సాయం చేసింది. భారతదేశానికి ఎల్లప్పుడూ మేం రుణపడి ఉంటామని తెలిపింది.