»Na Samiranga Nagarjunas Time Has Come What Will Na Samiranga Do
Na Samiranga: నాగార్జున టైం వచ్చేసింది.. ‘నా సామిరంగ’ ఏం చేస్తాడో?
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ' సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాసామిరంగ ట్రైలర్ టైం వచ్చేసింది.
Na Samiranga: జనవరి 14న నా సామిరంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే.. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. కానీ ఇంకా నాగార్జున ‘నా సామిరంగ’ ట్రైలర్ బయటికి రాలేదు. ఈ ట్రైలర్ రిలీజ్ అయితే గానీ సినిమా పై అనుకున్నంత హైప్ రాదు. అందుకే.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
నా సామిరంగ ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 9న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ బయటికి రానుంది. ఇక్కడి నుంచి ‘నా సామిరంగా’ సినిమా పై సాలిడ్ బజ్ సనరేట్ చెయడం పక్కా అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో పక్కా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుంది.
అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అల్లరి నరేష్‌కు జంటగా మిర్నా మోహన్ నటిస్తుండగా.. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ నటిస్తోంది. ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్‌తోనే నాగ్ వాళ్లకు మాస్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ట్రైలర్ ఇంకెలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.