ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. దీంతో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులు దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని నిషాంత్ పిట్టి సోషల్ మీడియాలో తెలిపారు.
Maldives: దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులు దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని నిషాంత్ పిట్టి సోషల్ మీడియాలో తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని మోదీ పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమ మాత్రమే? మా దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో భారత్‌కు చెందిన పలు సంస్థలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈక్రమంలో ఈజ్‌మై ట్రిప్ మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేసింది. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం #BoycottMaldives ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే కూడా మాల్దీవులలో తన షూటింగ్‌ను రద్దు చేసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మాల్దీవులు అంటే చాలా ఇష్టమని.. కానీ ఇక నుంచి అక్కడ షూటింగ్ చేయనని తెలిపారు. తర్వాత షెడ్యూల్ మాల్దీవుల్లో ఉండటంతో నేను అక్కడికి వెళ్లనని టీమ్‌కు చెప్పానని స్క్రీన్ షాట్‌ను కూడా పెట్టారు. లక్షద్వీప్‌లో షూట్ చేస్తారని ఆశిస్తున్నానని ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
I love shooting in Maldives but I will never shoot in Maldives again. When I was scheduled to shoot my next shoot in Maldives, I told my team that I will not Fly if this shoot gets stuck in Maldives. Fortunately, they agreed and now hoping to shoot in lakshadweep. #cancelledshoot… pic.twitter.com/nQE73E818A