కోనసీమ: రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. లబ్దిదారులను ఎలక్ట్రానిక్ పద్దతిలో గుర్తించేందుకు వీలుగా ఈ ప్రక్రియ అమలులో ఉందని, రేషన్ కార్డులో పేరు కలిగిన ప్రతీ ఒక్కరూ ఈకేవైసీ పూర్తి చేసుకుని నిరంతరాయంగా ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలన్నారు.