KRNL: యూట్యూబ్లో వీడియోలను చూసి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన కర్నూలు 3వ పట్టణ PSపరిధిలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన కేసు వివరాలను జిల్లా SP విక్రాంత్ పాటిల్ శనివారం మీడియాకు వెల్లడించారు. RTC డిపో మేనేజర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగిన తీరును SP వివరించారు. 6 గురు నిందితులను అరెస్ట్ చేయగా, మొత్తం 27 తులాల బంగారం, 30 తులాల వెండి రికవరీ చేశామన్నారు.