PPM: జిల్లాలో మే 1నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. శాప్ వీసీ, ఎండీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 50 మందితో (25 మంది బాలురు&25 మంది బాలికలు) 50వ వార్షిక వేసవి క్రీడా శిబిరాలను నిర్వహించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.