1994 ఏప్రిల్ 27న దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా అందరికీ ఓటు హక్కుతో కూడిన బహుళజాతి ఎన్నికలు జరిగాయి. ఇది ఆ దేశ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టం అని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో నెల్సన్ మండేలా నాయకత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ANC) విజయం సాధించి, ఆయన దేశపు మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో వర్ణవివక్ష పాలనకు ముగింపు పలికారు. ఇది జరిగి ఇవాళ్టికి 31 ఏళ్లు పూర్తయింది.