VZM: బొండపల్లి మండలం నిలువాడ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎవరికి ఇటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు లారీలు స్వల్పంగా ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బొండపల్లి ఎస్సై యు. మహేశ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.