Jio Annual Plan : జియో నెట్ వర్క్ వాడేవాళ్లకు గుడ్ న్యూస్. జియో కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల తీసుకొచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ లో వార్షిక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. రూ.2999 పెట్టి జియో రీచార్జ్ చేయిస్తే సంవత్సరం పాటు జియో సేవలను వినియోగించుకోవచ్చు. 365 రోజుల పాటు ప్యాక్ వాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే.. అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వాటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ కు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ ను అందిస్తారు.
అయితే.. ఈ ప్లాన్ ను మరో 23 రోజులకు పెంచుతూ జియో తాజాగా నిర్ణయం తీసుకుంది. 365 రోజులు ప్లస్ మరో 23 రోజులు మొత్తం 388 రోజుల పాటు రూ.2999 తో రీచార్జ్ చేసుకుంటే ప్లాన్ వాలిడిటీ ఉంటుంది. మరో 75 జీబీ అదనంగా హైస్పీడ్ డేటాను కూడా పొందొచ్చు.