CM Jagan: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పరామర్శించారు. తాడిపెల్లి గూడెం నుంచి బయలుదేరిన జగన్ గురవారం ఉదయం 11.30 గంటలకు బేగం పేట విమానాశ్రయం చేరుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అనంతరం బంజారహిల్స్‌లోని నందీనగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికిి చేరుకున్నారు. కేటీఆర్(KTR) సీఎం జగన్‌కు స్యయంగా స్వగతం పలికారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను ఏపీ సీఎం పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గత నెలలో ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఎడమతుంటి విరిగింది. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నారు.