జనవరిలో సగం రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉండనుంది. జనవరి 1వ తేదిన కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 2024 జనవరిలో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు, పండగలు అన్నీ కలుపుకుని 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి కొన్ని మారుతుంటాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకుందాం.
2024 జనవరిలో బ్యాంకు సెలవులివే:
జనవరి 1 – సోమవారం – నూతన సంవత్సరం ప్రారంభం
జనవరి 2 – మంగళవారం – న్యూ ఇయర్ సెలబ్రేషన్ – ఐజ్వాల్‌లో సెలవు
జనవరి 7 – ఆదివారం – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 11- గురువారం – మిషనరీ డే – ఐజ్వాల్‌లో సెలవు
జనవరి 13 – రెండో శనివారం – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 14 – ఆదివారం – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 15 – సోమవారం – మకర సంక్రాంతి పండుగ – తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గువాహటిలో సెలవు
జనవరి 16 – మంగళవారం – తిరువళ్లూవర్ డే – చెన్నైలో సెలవు
జనవరి 17 – బుధవారం – శ్రీ గురు గోవింద్ సింగ్ జీ జయంతి – చండీగఢ్, చెన్నైలో సెలవు
జనవరి 21 – ఆదివారం – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 22 – సోమవారం – ఇమోయిను ఇరట్ప – ఇంఫాల్‌లో సెలవు
జనవరి 23 – మంగళవారం – గాన్-నగై – ఇంఫాల్‌లో సెలవు
జనవరి 25 – గురువారం – థాయ్ పూసం/మొహమ్మద్ హజారత్ అలీ జయంతి – చెన్నై, కాన్పూర్, లఖ్‌నవూలో సెలవు
జనవరి 26 – శుక్రవారం – గణతంత్ర దినోత్సవం – అగర్తల, దెహ్రాదూన్, కోల్‌కతా మినహా భారతదేశం అంతటా సెలవు
జనవరి 27 – నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 28 – ఆదివారం – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు