»Trisha Re Entry After 13 Years Romance With Star Hero
Trisha : 13 ఏళ్లకు త్రిష రీఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్?
ఇక హీరోయిన్గా త్రిష పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది అమ్మడు. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. ఇక ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత బంపర్ ఆఫర్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు.
చెన్నై చిన్నది త్రిష హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటింది. అయినా కూడా ఇంగా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతునే ఉంది. నాలుగు పదుల వయసుకు చేరవుతున్న త్రిష అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు కదా.. రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తోంది. త్రిష ముందు ఏ కుర్ర హీరోయిన్ కూడా పనికి రాదనే రేంజ్లో ఉంది. ఆ మధ్య మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఐశ్వర్య రాయ్‌ని సైతం డామినేట్ చేసేలా కనిపించింది త్రిష. అందుకే అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. చివరగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమాలో ప్రేక్షకులను పలకరించిన త్రిష.. ప్రస్తుతం తమిళ్, మళయాళంలో సినిమాలు చేస్తోంది. త్వరలోనే టాలీవుడ్ రీ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ రీ ఎంట్రీకి త్రిష రెడీ అయినట్టుగా తెలుస్తోంది. 2010లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ తర్వాత బాలీవుడ్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే ఇప్పుడు.. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమాలో నటించబోతున్నట్టుగా సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ వంటి యాక్షన్ సినిమా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్.. సల్లూ భాయ్‌తో ‘ది బుల్’ అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దాదాపు 25 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ కాంబోలో సినిమా సెట్ అవడంతో.. ది బుల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏదేమైనా.. త్రిష క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.