తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ రోజు(27 జనవరి) నుండి ప్రారంభం కానుంది. ఉదయం గం.11.03 నిమిషాలకు నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. 4000 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర 400 రోజులు సాగనుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం లోకేష్ కుప్పం వచ్చారు. ఆడపడుచులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బడ చేశారు. ఉదయం స్థానిక వరదరాజ స్వామి ఆలయంలో పూజలు చేసి, 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. టీడీపీ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతలు పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
175 నియోజకవర్గాల ఇంచార్జీలు, ముఖ్య నేతలు, సుమారు 90 మంది స్థానిక లీడర్లు, నిర్వాహకులతోపాటు టీడీపీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సుమారు 300 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. వేదిక మీదకు కూర్చునే వారికి పాసులను అందిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుంది. వేదిక పైనుండి లోకేష్ మాత్రమే మాట్లాడుతారని తెలుస్తోంది.