»Rahul Gandhi Congress Leader Ready For Another Trip
Rahul Gandhi: మరో యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ అగ్రనేత
బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర పేరుతో 14 రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించనున్నారు. జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ఈ యాత్ర ముగియనుంది. మణిపూర్ నుంచి ముంభై వరకు సుమారు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. మొత్తం 6,200 కి.మీ మేర ఈ యాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో ముచ్చటించనున్నట్లు పేర్కొన్నారు. అయితే గతంలో మాదిరిగా మొత్తం పాదయాత్ర కాకుండా ఈ సారి బస్సు యాత్ర కూడా చేపట్టనున్నారు. మధ్యమధ్యలో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్ర అని.. అందుకే దీనికి భారత్ న్యాయ యాత్ర అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.
భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టారు. దాదాపు అయిదు నెలల పాటు 4500 కి.మీ మేర 12 రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగింది. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేసి ఈ యాత్రను ముగించారు. దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్.. ఈసారి తూర్పు నుంచి పశ్చిమ వరకు యాత్ర చేపట్టనున్నారు.