ఈ మధ్య స్టార్ బ్యూటీ సమంత గురించి పెద్దగా సినిమా వార్తలు బయటికి రావడం లేదు. అమ్మడు కూడా మునుపటిలా యాక్టివ్‌గా లేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదో అప్డేట్స్ ఇస్తుంటుంది. అయితే.. తాజాగా అమ్మడు నటిస్తున్న వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది సామ్. దీంతో పాటు వరుణ్ ధావన్‌తో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసిన సమంత.. మయోసైటిస్ కారణంగా.. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. అంతేకాదు.. ఆ సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేసింది. చెప్పినట్టుగానే.. ఈ మధ్య విదేశాల్లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంది. పలు దేశాలు తిరిగిన తర్వాత ఇటీవలె ఇండియా తిరిగొచ్చింది సామ్. అప్పుడప్పుడు ముంబైలో మీడియా కంట పడుతునే ఉంది.
అయితే సమంత మయోసైటిస్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందా? సమంత మళ్ళీ సినిమా షూటింగ్స్‌కి రెడీ అవుతోందా? అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. కనీసం షూటింగ్ పూర్తి చేసిన సిటాడెల్ ఎప్పుడు రిలీజ్ అవుతందనేది కూడా తెలియకుండా ఉంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కు జోడీగా సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది సామ్.ఇది కేవలం ఇండియన్ వెర్షన్ మాత్రమే. ఒరిజినల్ వెర్షన్లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ పోషించింది. ఇప్పటికే అమెజాన్‌లో ప్రియాంక చోప్రా సిరీస్ రిలీజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు సమంత నటించిన సిటాడెల్ కూడా ఓటిటిలో స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
లేటెస్ట్ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సిటాడెల్ వెబ్‌సిరీస్ వచ్చే ఏడాది మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో సమంత పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే సిటాడెల్ రిలీజ్ డేట్ పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.