Hydrabad : చెట్లు నరుకుతుంటే అడ్డం పోయిన కుర్రాడు.. తర్వాత ఏమైందంటే
పిల్లలు దేవుడితో సమానం అంటారు. వారు ఏదైనా మనసులోకి తీసుకుంటే దానికోసం ప్రాణాలు సైతం ఇస్తారు. వారు చెప్పే మాటలు ఒక్కోసారి కోపం చిరాకు తెప్పించినా వారు మాట్లాడే మాటల్లో నిజం ఉంటుంది.
Hydrabad : పిల్లలు దేవుడితో సమానం అంటారు. వారు ఏదైనా మనసులోకి తీసుకుంటే దానికోసం ప్రాణాలు సైతం ఇస్తారు. వారు చెప్పే మాటలు ఒక్కోసారి కోపం చిరాకు తెప్పించినా వారు మాట్లాడే మాటల్లో నిజం ఉంటుంది. వారి చేసే పనులు విసుగు తెప్పించేలా ఉన్నా.. వాటికో అర్థం ఉంటుంది. కొందరు పెద్దలు తప్పు చేసినా.. వాటిని కరెక్ట్ చేసేందుకు పిల్లలు ప్రయత్నిస్తారు. కానీ పెద్దలు పట్టించుకోరు. పసిహృదయాలు వారికి నచ్చనిది ఏదైనా జరిగితే తట్టుకోలేరు. వారి తెగింపుకు కుటుంబ సభ్యులే కాదు ఎంతటి అధికారులైనా తలవంచాల్సిందే. పక్షులకి నివాసంగా ఉన్న చెట్టును కొందరు అధికారుల నరకుతుంటే అది చూసి భరించలేని పిల్లవాడు నరకద్దంటూ చెట్టెక్కి కూర్చున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది.
రామచంద్రాపురంలోని కాకతీయ నగర్ లో అనిరుధ్ అనే బాలుడు కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంటి ముందు పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లపై పక్షులు వాలడం, వాటి అరుపులంటే అనిరుధ్ కు చాలా ఇష్టం. రోడ్డు వెడల్పు కోసం చెట్లను కాంట్రాక్టర్ నరుకుతూ అనిరుధ్ ఇంటి వరకు వచ్చేశాడు. అది గమనించిన అనిరుధ్ సార్ ప్లీజ్ చెట్లను నరకవద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే కాంట్రాక్టర్ అనిరుధ్ మాటలు పట్టించుకోకుండా చెట్లను నరకడం కొనసాగిస్తూనే ఉన్నాడు. చివరకు అనిరుధ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. నరుకుతున్న చెట్టుపై ఎక్కి అక్కడే కూర్చున్నాడు. నేను దిగను మీరు చెట్లను నరకడం ఆపండి అన్నాడు. అనిరుధ్ మాటలకు అధికారులు సైతం షాక్ అయ్యాడు. అంత చిన్న పిల్లాడు చెట్లను నరకవద్దని చెప్పడం ఏంటని ఆలోచనలో పడ్డారు. అంతేకాదు పక్షులకి ఆవాసంగా ఉన్న చెట్టును నరకవద్దంటూ అనిరుధ్ కోరడమే కాదు. చెట్టుతో పాటు నన్ను చంపేయండి అంటూ మారాం చేశాడు. ఆ పిల్లాడు అలా చెట్టెక్కి కూర్చోవడంతో అధికారులు చేసేదేమీ లేక చెట్లను నరకడం కాసేపు నిలిపివేశారు. పిల్లాడిని కిందికి రావాలని కోరగా.. మీరందరూ చెట్లను నరకకుండా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అయితే అనిరుధ్ ను చెట్టుపై నుంచి దించేందుకు అధికారులు నానాపాట్లు పడ్డారు.