»Yuvagalam Navasakam Public Meeting December 20th 2023 Huge Arrangements In Polipally
Yuvagalam navasakam: రేపే బహిరంగ సభ..పోలిపల్లిలో భారీ ఏర్పాట్లు
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ రేపు పోలిపల్లిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు.
Yuvagalam navasakam public meeting december 20th 2023 huge arrangements in Polipally
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(NaraLokesh) యువ గళం నవశకం(Yuvagalam navasakam) పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ రేపు(డిసెంబర్ 20న)(public meeting) ఘనంగా నిర్వహించనున్నారు. అందుకోసం విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యువగళం నవశకం బహిరంగ సభకు వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. అంతేకాదు జిల్లా నుంచి ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలిస్తున్నారు.
ఈ రైలు ధర్మవరం నుంచి బయలుదేరి అనంతపురం, గుత్తి రైల్వేస్టేషన్లలో టీడీపీ(TDP) కార్యకర్తలను ఎక్కించుకుంటుంది. దీంతోపాటు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యులు ధర్మవరం, అనంతపురం గుత్తి రైల్వేస్టేషన్‌కు తరలివస్తున్నారు. ఇప్పటికే టీడీపీ శ్రేణుల రాకతో అనంతపురం రైల్వేస్టేషన్ ప్రస్తుతం పసుపుమయంగా మారింది. ఇక ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సభ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.