TG: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేవాదుల ఫండ్ రైజింగ్ కోసమే రేవంత్ వచ్చారని, కేరళ ఎన్నికలకు ఫండ్ పంపడం కోసం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారని, కేరళ ఎన్నికలకు రూ.వెయ్యి కోట్లు పంపడానికే ఈ డ్రామా అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే.. మీ అవినీతిపై విచారణ ఉంటుందన్నారు.