WGL: “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సాదాబైనామాలకు పట్టాలు వస్తాయని రైతులు ఎదురుచూస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అఫిడవిట్ నిబంధనను తొలగించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 2,71,790 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.