»Indian Stock Market Losses December 13h 2023 Sensex Loss 313 Points
Indian stock market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..311 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 13న నష్టాల్లో దూసుకెెళ్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ సహా దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం సహా పలు అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో NSE నిఫ్టీ 50 ఇండెక్స్ (.NSEI) 0.31%కి పైగా క్షీణించి 20,810 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు S&P BSE సెన్సెక్స్ (.BSESN) 0.32%కిపైగా పతనమై 69,231.07 పాయింట్లకు 10:41 a.m. ISTకి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్లకుపైగా నష్టపోయి 46,920 పరిధిలో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 35 పాయింట్లు తగ్గి 44,520 వద్ద ఉంది.
అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై అంచనాలతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అమెరికా డేటా ప్రకారం ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ పతనం కావడంతో భారత బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు బుధవారం పడిపోయాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో నిఫ్టీ 50లో 13.64% వెయిటేజీతో IT రంగం (.NIFTYIT), 1.5% క్షీణించింది. మొత్తం 10 ప్రధాన స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. వాటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS.NS), ఇన్ఫోసిస్ (INFY.NS) 1.5%, 2.3% మధ్య పడిపోయిన టాప్ నిఫ్టీ 50 లూజర్లలో ఉన్నాయి. దీంతోపాటు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో ఎనర్జీ స్టాక్స్ (.NIFTYENR) 0.4% లాభపడింది.
ఇటివల 2024 మొదటి అర్ధభాగంలో ఫెడ్ రేటు తగ్గింపు అవకాశంపై డేటా సందేహాలను లేవనెత్తింది. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఫెడ్ పాలసీ నిర్ణయానికి ముందు ఆసియా మార్కెట్లు క్షీణించాయి. అంతేకాదు ఇటివల విడుదలైన దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉండటం, ఫ్యాక్టరీ ఉత్పత్తిలో పెరుగుదల, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం వంటి అంశాలు కూడా భారతీయ ఈక్విటీలు దిగువకు పయనించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.