Alla Ramakrishna Reddy: వైసీపీ పార్టీకి ఉహించని షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సడెన్గా రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో లోకేశ్ మీద పోటీ చేసి ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలుపొందాడు.
కొన్ని రోజలు నుంచి ఆర్కే వైసీపీ కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తి చెందారు. నియోజవర్గానికి రూ.1250 కోట్ల నిధులను మంజూరు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ నుంచి వచ్చిన గంజి చీరంజీవికి నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వడం, ఆయకు ఆప్కో ఛైర్మన్ పదవి ఇవ్వడం కారణాలు అయిఉండవచ్చని సమాచారం.