»Family From Ap Committed Suicide In Varanasi Ashram
Varanasi: వారణాసి ఆశ్రమంలో ఏపీకి చెందిన కుటుంబం ఆత్మహత్య
ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసి యాత్రకు వెళ్లి అక్కడే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రానికి చెందిన కుటుంబంలో వారణాసి (Varanasi)లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వారణాసి యాత్రకు వచ్చి అక్కడి ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన భార్య, భర్త, ఇద్దరు కుమారులు ఆధ్యాత్మిక యాత్రకు వచ్చి వారణాసిలో ప్రాణాలు విడిచారు.
డిసెంబర్ 7వ తేదిన ఆంధ్రాకు తిరిగి రావాల్సిన వారు రాలేదు. వారణాసి (Varanasi)లో వారు బస చేసిన ఆశ్రమంలోని గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. ఎంతకీ వారు బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులను బలవంతంగా తెరిచి చూడగా అప్పటికే వారు శవాలై కనిపించారు.
ఆర్థిక సమస్యలతోనే కుటుంబ సభ్యులు ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. తెలుగులో వారు రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని తన కార్యాలయంలో ఒకరితో ఆర్థిక వివాదంలో ఉన్నట్లు సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఆర్థిక సమస్యలతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగానే పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనపై వారణాసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.