RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేయనుంది. ఈ మేరకు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా దాదాపు మూడు రోజుల పాటు ద్రవ్య విధాన కమిటీ సమావేశం కానుంది. అయితే కమిటీ నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ శుక్రవారం ప్రకటించనున్నారు. అయితే ఈసారి కూడా కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రెపో దాదాపు 6.5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో మందగించిన వృద్ధి రేటును పెంచడానికి ఆర్బీఐ రెపో రేటును భారీగా తగ్గించింది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగుపడింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో రెపో రేటును పెంచుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే గత కొన్నేళ్లుగా ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి వెళ్లడం లేదు. ఈ సమీక్షలో కూడా వడ్డీ రేట్లను పెంచే ఆలోచన ఆర్బీఐకి లేదని సమాచారం. ఇదే జరిగితే.. వరుసగా ఐదో సారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉండనున్నాయి.