»Tecno Spark Go Tecnos New Mobile For Rs 699 These Are The Features
Techno Spark Go: రూ.6699లకే టెక్నో కొత్త మొబైల్.. ఫీచర్లు ఇవే!
టెక్నో ఫోన్ల కంపెనీ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. 5,000mAh బ్యాటరీతో తక్కువ ధరకి లభ్యం అవుతుంది. దీనికి టెక్నో స్పార్క్ గో 2024గా లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు ఏంటో మరి తెలుసుకుందాం.
Techno Spark Go: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ఏడాది టెక్నో స్పార్క్ గో 2023ని లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు అదే సిరీస్‌లో టెక్నో స్పార్క్ గో 2024 పేరుతో మరో మొబైల్ తీసుకొచ్చింది. మూడు వేరియంట్లలో లభించే ఈ మొబైల్.. 5,000mAh బ్యాటరీతో తక్కువ ధరకే దొరుకుతుంది. 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.6,699గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+64జీబీ వేరియంట్, 8జీబీ+128జీబీ వేరియంట్ ధరల్ని ఇంకా వెల్లడించలేదు. ఈ మొబైల్ గ్రావిటీ బ్లాక్, మిస్ట్రీ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. డిసెంబరు 7వ తేదీ నుంచి వీటి విక్రయాలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ 6.56 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత హెచ్ఐఓఎస్తో పనిచేస్తుంది. పాండా స్క్రీన్ ప్రొటెక్షన్‌తో డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ అమర్చారు. ఫోన్ వెనుక 13ఎంపీ ప్రధాన కెమెరా డ్యుయల్ ఫ్లాష్‌లైట్, ఏఐ లెన్స్ ఉన్నాయి. వీడియోకాల్స్, సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ, డీటీఎస్, సౌండ్ టెక్నాలజీతో డ్యుయల్ స్టీరియో స్పీకర్ల సదుపాయంతో ఈ మొబైల్ వస్తోంది.