Naa Saami Ranga in final stages of shooting — Sankranthi release
Naa Saami Ranga: నాగార్జున హీరోగా నటిస్తోన్న నా సామి రంగ (Naa Saami Ranga) మూవీ నుంచి ఇదివరకే గ్లింప్స్ విడుదల చేశారు. అవి ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా హీరోయిన్ గ్లింప్స్ కూడా విడుదల చేయగా, అవి కూడా అందరికీ నచ్చాయి. మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. కింగ్ నాగార్జున అక్కినేని, విజయ్ బిన్ని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నా సామి రంగ నుంచి నటి ఆషికా రంగనాథ్‌ను ‘వరలక్ష్మి’గా పరిచయం చేస్తూ కొత్త వీడియో ఇటీవల విడుదలైంది.
ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను పరిచయం చేసిన కింగ్ నాగార్జున అక్కినేని.. తన రాబోయే చిత్రం నా సామి రంగతో మరో ఫస్ట్ టైమ్ విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఇందులో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా, ఈరోజు మేకర్స్ నటి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఆశికా రంగనాథ్ పోస్టర్ ద్వారా ‘వరలక్ష్మి’గా పరిచయం చేశారు.
నగలతో సంప్రదాయ దుస్తులలో ఆకర్షణీయంగా ఉంది. నటి అద్దం ముందు కూర్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. నాగ్ లుక్ కూడా చాలా బాగుంది. ఆస్కార్-విజేత స్వరకర్త MM కీరవాణి తన స్పెల్ బైండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత మంత్రముగ్ధులను చేసాడు. నాగార్జున మాస్‌గా కనిపించగా, ఆషికా రంగనాథ్ హాఫ్ చీరలో అచ్చ తెలుగు అమ్మాయి లుక్‌లో అదరగొట్టింది.
కొరియోగ్రాఫర్‌గా విజయ్ బిన్నీ, ఆషిక నుంచి సరైన ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చారు. మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ కాంబినేషన్లో ఆల్బమ్ చాలా మంది ఎదురుచూస్తున్న వాటిలో ఒకటి. ఈ మూవీలో మంచి ప్రేమ కథ కూడా ఉందని రీసెంట్ గా నాగ్ కూడా చెప్పడం విశేషం.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్కు చెందిన అభిరుచి గల నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించారు. మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ చిత్రానికి కథ, మాటలు అందించారు. నా సామి రంగ 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. నాగ్‌కి సంక్రాంతి జోన్ ఎప్పుడూ కలిసి వస్తుంది. ఈ మూవీ కూడా అందుకోసమే తీసుకు వస్తున్నారు.