»The Man Who Came And Voted On A Cow The Video Went Viral
Nirmal: ఆవుపై వచ్చి ఓటేసిన వ్యక్తి..వీడియో వైరల్
ఓ వ్యక్తి ఆవుపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన సంఘటన తెలంగాణలోని నిర్మల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల వేళ ఓ వ్యక్తి ఆవుపై వచ్చి ఓటు (Vote) వేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. నిర్మల్ జిల్లా (Nirmal District) తానూరు మండలం మహలింగి గ్రామానికి చెందిన వ్యక్తి ఓటు వేయడానికి ఆవుపై వచ్చాడు. పోలింగ్ కేంద్రానికి (Polling Centre) ఆవుపై రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ వ్యక్తి ఆవుపై రావడం పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సొంత గ్రామ సభ్యులు మాత్రం ఈ విషయంపై అంతగా పట్టించుకోలేదు. జంతుప్రేమికులు ఆ వ్యక్తి చేసిన పనికి ఫైర్ అవుతున్నారు. మూగజీవిని హింసిస్తూ రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.