Vignesh Shivan: షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. నవంబర్ 18న 39 ఏళ్లు పూర్తి చేసుకుంది. పుట్టినరోజు కానుకగా భర్త-దర్శకుడు మెర్సిడెస్ మేబ్యాక్‌ను బహుమతిగా ఇచ్చారు. భర్త ఇచ్చిన బహుమతిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసింది. నయన్ తన పుట్టిన రోజుని భర్త, ఇద్దరు కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో కలిసి జరుపుకుంది.
రాబోయే చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), ఆలస్యంగా పుట్టినరోజు బహుమతి అందజేసి భార్యను ఆశ్చర్యపరిచాడు. లగ్జరీ కారు గిఫ్ట్ ఇవ్వడంతో అందరూ షాకవుతున్నారు. నవంబర్ 29న నయనతార తన కొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఫోటోలను పంచుకున్నారు. కారు ప్రాథమిక ధర రూ. 2.69 కోట్లతో ప్రారంభం కాగా, టాప్ ఎండ్ కారు ధర రూ. 3.40 కోట్లు కావడం గమనార్హం.
ఫోటోలను పోస్ట్ చేసి, “వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ @wikkiofficial మై డియర్ హస్బెండ్, అత్యంత మధురమైన పుట్టినరోజు బహుమతి లవ్ యు (sic)కి ధన్యవాదాలు” అని చాలా హార్ట్ ఎమోజీలను కూడా షేర్ చేశారు. 2023లో నయనతార (nayanatara) ‘జవాన్’ ‘ఇరైవన్’ అనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ‘ఇరైవన్’ యావరేజ్‌గా మిగిలింది. త్వరలో నయన్ ‘అన్నపూరాణి’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.
విఘ్నేష్ శివన్ ‘లవ్ టుడే’ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ప్రి-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. నటీ నటులు, సిబ్బందికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.