యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పటికే ఓ డేట్ లాక్ చేసుకొని షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అదే రోజు నేను కూడా వస్తున్నాని అనౌన్స్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు యంగ్ హీరోల బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారింది.
Ram: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో బిజీగా ఉన్నాడు. రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమా నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పై మంచి బజ్ ఉంది. అయితే ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తున్నారు.
2024 మార్చి 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు రామ్ పోతినేని (Ram) నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అవుతోంది. అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేస్తున్నాడు పూరి. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌కు పోటీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సై అంటున్నాడు విశ్వక్ సేన్. దీంతో ఈ ఇద్దరు యంగ్ హీరోల బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఇద్దరికీ పోటిగా ఇంకెవరైనా వస్తారా? లేదంటే ఇద్దరే బాక్సాఫీస్‌ను షేర్ చేసుకుంటారా? అనేది చూడాలి.