Second T20లో టీమిండియా బంఫర్ విక్టరీ..2-0 లీడ్‌లో భారత్
రెండో టీ 20లోనూ భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.
Team India Won: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే టీ 20పై అంతగా శ్రద్ద కనబరచడం లేదు. అయినప్పటికీ భారత (india) జట్టు రాణిస్తోంది. రెండో టీ 20 మ్యాచ్‌లోనూ బంఫర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలవనుంది. సిరీసే కాదు.. ఆసీస్‌ను వైట్ వాష్ చేస్తే.. ప్రేక్షకులు కొంతలో కొంతైనా మళ్లీ క్రికెట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా (Team India) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల చేసింది. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఏ దశలోనూ విజయం దిశగా అడుగులు వేయలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు సమర్పించుకుని, కేవలం 191 రన్స్ మాత్రమే చేసింది. టీమిండియా (Team India) బౌలర్లు రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచారు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.
ఆసీస్ జట్టులో మార్కస్ స్టొయినిస్ ఒక్కటే 45 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 37, స్టీవ్ స్మిత్ 19, మాథ్యూ షార్ట్ 19 రన్స్ చేశాడు. ఫస్ట్ టీ 20లో సెంచరీ చేసిన జోష్ ఇంగ్లిస్ సెకండ్ మ్యాచ్‌లో 2 పరుగులే చేశాడు. చివరలో కెప్టెన్ మాథ్యూ వేడ్ 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడినప్పటికీ అతనికి సహకరం ఇచ్చే వారు ఎవరూ లేరు.