RR: వినాయక చవితి పండుగ నిర్వహణకు మన్సురాబాద్ డివిజన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణను కార్పొరేటర్ నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. డివిజన్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సాధించాలన్నారు.