బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్3 సినిమాకు వంద కోట్ల లాస్ తప్పేలా లేదంటున్నారు. రోజు రోజుకి టైగర్ క్రేజ్ తగ్గడమే అందుకు కారణం అంటున్నారు. మరి ఇప్పటివరకు టైగర్ 3 ఎంత రాబట్టింది.
ఆదిత్య చోప్రా నిర్మాణంలో, మనీశ్ శర్మ దర్శకత్వంలో.. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా దీపావళి కానుకగా నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది టైగర్ 3. అయితే డే వన్ నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ టైగర్ కలెక్షన్లను గట్టి దెబ్బ తీసింది. ప్రపంచ కప్ క్రికెట్ పైనల్ జరిగిన రోజు నుంచి టైగర్ 3 వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. అప్పటి నుంచి టైగర్ 3 కోలుకునే పరిస్థితి లేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. మొత్తంగా 13 రోజుల్లో, అంటే దాదాపు వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 427 కోట్ల గ్రాస్ వసూలు చేసింది టైగర్ 3.
ఈ సినిమాని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ లెక్కన టైగర్ బడ్జెట్‌కు డబుల్ రాబట్టాల్సి ఉంది. కానీ లేటెస్ట్ టైగర్3 వసూళ్లు చూస్తుంటే.. ఫైనల్ రన్లో ఎంత రాబట్టిన వంద కోట్ల లాస్ తప్పదని అంటున్నారు. అసలు యశ్ రాజ్ స్పై యూనివర్స్‌కు ఉన్న క్రేజ్‌కు మినిమం 600-700 కోట్లు రాబట్టాల్సింది టైగర్ 3. దీనికంటే ముందు వచ్చిన స్పై యూనివర్స్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఏకంగా వెయ్యి కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కానీ టైగర్ 3 మాత్రం 500 కోట్ల మార్క్‌ను టచ్ చేయడమే కష్టంగా ఉంది.
దీనికి కారణం విడుదల తేదీ కరెక్ట్ కాదనే చెప్పాలి. రిలీజ్ చేయడమే దీపావళి రోజు రిలీజ్ చేశారు. అది కూడా సండే, పూజలు కావడంతో.. అనుకున్నంత రేంజ్లో వసూళ్లను అందుకోలేపోయింది. అయితే.. డిసెంబర్ 1న యానిమల్ వచ్చే వరకు హిందీలో పెద్ద సినిమాల విడుదల లేదు. కాబట్టి టైగర్ 3కి ఒక్క వారం మాత్రమే టైం ఉంది.