»Animal Dunki Prabhas Salars Movies Are Releasing In December
Movies: డిసెంబర్లో అన్ని పెద్ద హీరోల సినిమాలే
సినీ ప్రియులకు డిసెంబర్ నెల పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సినిమాలు విడుదల అవుతుండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సినిమాలు ఏంటి? రిలీజ్ ఎప్పుడు? లాంటి విషయాలను తెలుసుకుందాం.
Animal, Dunki, Prabhas Salar's movies are releasing in December.
Movies: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాలు డిసెంబర్లో విడుదల అవుతున్నాయి. స్టార్ హీరోలు నటించిన మూవీస్ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. రిలీజ్ కాబోయే సినిమాల షెడ్యూల్ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి.
యానిమల్:
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా యానిమల్(Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి. T-Series, Cine1 స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ స్టార్ నటులు ఉన్నారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డంకి:
అక్రమంగా బార్డర్ దాటడం చుట్టు కేంద్రీకృతమై ఉన్న ఈ కామెడీ డ్రామాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్(Sharukh khan), తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ నటించారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. అభిజాత్ జోషి, కనికా ధిల్లాన్‌లు రచించిన ఈ చిత్రం రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై రూపోందింది. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా డంకి(Dunki) విడుదలకు సిద్ధంగా ఉంది.
సాలార్ పార్ట్ 1:
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ సలార్. పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్ తదితరులు నటించిన సాలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం కావడం, బాహుబలి తరువాత హీరోకు సరైన హిట్ లేని కారణంగా అభిమానులు సలార్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.
హాయ్ నాన్నా:
వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి K. S. నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్నా(Hi Nanna). నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించిన డిసెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది.