W.G: భీమవరంలోని మారుతీ థియేటర్ సెంటర్లో ఉన్న దాసాంజనేయ స్వామి వారిని, 45వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు.