»Cm Jagan Helps The Fishermen Whose Boats Were Burnt
CM Jagan: బోట్లు కాలిపోయిన మత్స్యకారులకు సీఎం జగన్ సాయం
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.
బోట్లు కాలిపోయిన మత్స్యకారులకు సీఎం జగన్ (Cm Jagan) ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రమాదంలో బోట్లు కాలిపోయాయి. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం పరిహారాన్ని అందించనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై సోమవారం అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనా స్థలాన్ని మంత్రి సిదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం అయ్యాయి. అంతేకాకుండా మరో 9 బోట్లు కొంత మేర దెబ్బతిన్నాయి. ఘటనలో రూ.12 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రమాదానికి గురైన బోట్లలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల విలువైన బోట్లు కూడా ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్ మాట్లాడుతూ..ఈ ఘటన మత్య్సకారులకు పెద్ద దెబ్బ అని, ఇలాంటి సమయంలో వారి జీవితాలను నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేందుకు సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బోట్లకు బీమా లేదని వారిని గాలికి వదిలేయమన్నారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం వరకూ పరిహారం ఇవ్వాలని, కష్టకాలంలో వారిని ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.