Hyderabad CP: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కార్యాలయంలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీకి చికిత్స అందిస్తున్నారు. ఆయన కు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని పరీక్షలు చేయాల్సి అవసరం ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించారు.
ఆస్పత్రిలో సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పలువురు పరామర్శించారు. ఇటీవలే హైదరాబాద్ సీపీగా శాండిల్య నియమితులైన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో భద్రత పరంగా ఆయన పలు కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ దిశనిర్దేశం చేస్తున్నారు. శాండిల్య గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (రైల్వేస్ & రోడ్ సేఫ్టీ), డైరెక్టర్ జనరల్ (జైళ్లు)గా విధులు నిర్వహించారు. శాండిల్య గోదావరిఖని (ASP), నల్గొండ (OSD), ఆదిలాబాద్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పని చేశారు.