Rahul Gandhi: మరోసారి తెలంగాణకు రానున్న రాహుల్.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దీంతో పార్టీ నేతలంతా ప్రచార బిజీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చోటా మోటా నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
Rahul Gandhi: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దీంతో పార్టీ నేతలంతా ప్రచార బిజీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చోటా మోటా నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి అగ్ర నేతలను రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు దింపుతోంది. ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణలో మరో సారి ప్రచారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్నారు.
ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. గెలుపు లక్ష్యంగా ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇక ఈ నెల చివర్లో తెలంగాణకు మరోసారి రాహుల్ గాంధీ రానున్నారు. నవంబర్ 25వ తేదీన… మెదక్,తాండూరు, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. కేవలం ఒక్కరోజులోనే ఈ మూడు నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు కాంగ్రెస్ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.