»Do You Know What The Lizard Did Instead Of Potato In The Samosa
UP : సమోసాలో బంగాళదుంపకు బదులు బల్లి ఏం చేశారో తెలుసా?
సమోసాలంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడుతారు. బహుశా ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండకపోవచ్చు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు జనాల్ని నోరూరిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని షాకింగ్ ఘటన జరిగింది
సమోసాలంటే చాల మంది లొట్టలేసుకుని తింటారు. గరం గరం సమోసా (Samosa) అంటే బహుశా ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండకపోవచ్చు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు జనాల్ని నోరూరిస్తుంటాయి.కాగా, కొందరు సమోసాలను స్నాక్ ఐటమ్(Snack item)ను ప్రతిరోజూ టీతో తింటారు. కొందరు సమోసాలు టైమ్ దొరికినప్పుడు తింటారు. తాజగా యూపీ (UP)లో షాకింగ్ ఘటన జరిగింది. హాపూర్‌లోని ఓ వ్యక్తి పండుగ సందర్భంగా.. తన ఇంటికి వచ్చిన బంధువుల కోసం సమోసాలు కొనుక్కోని తీసుకెళ్లాడు. సమోసాలు కొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అందరూ ఆ సమోసాలను తిన్నారు.
ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన సమోసాలను ఆ వ్యక్తి కూడా తింటుండగా టేస్ట్‌లో ఏదో తేడా ఉందని చూడటంతో.. సమోసా లోపల బంగాళదుంపకు బదులుగా బల్లి (Lizard) కనిపించింది. బల్లిని చూసి షాక్ తిన్న అతడు వెంటనే నోట్లోది బయటకు ఉమ్మి, వాంతులు చేసుకున్నాడు. ఈ సమోసా తిన్న 13 ఏళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో బాలికను ఆసుపత్రి (Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ న్యూస్ స్థానికులకు తెలియడంతో ఒక్కసారిగా సంఘటన జరిగిన ఇంటి వద్ద గుమిగుడారు. బాధిత కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సమోసా ప్రియులను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.