Banks strike : డిసెంబరు 4 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న వివిధ బ్యాంకులు
భారతదేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకులు సమ్మె కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూతపడనున్నాయి (Banks strike). తమ సమస్యలతో పాటూ సదుపాయాల నిమిత్తం స్ట్రైక్లోకి వెళ్లనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు డిసెంబర్ 4 నుండి జనవరి 20 వరకు తేదీల వారీగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో తగినంత మంది శాశ్వత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలకు స్వస్తి పలకాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ఉద్యోగుల వల్ల బ్యాంకు ఖాతాదారుల కీలక సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PNB)సమ్మె చేయనున్నాయి. డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్.. డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.జనవరి 2న తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(Telangana), కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్వదీప్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మెలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు జనవరి 4 మరియు 5 తేదీలలో మూసివేయబడతాయని తెలిపింది. రెండు రోజుల అఖిల భారత బ్యాంకుల సమ్మెలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి.