చంద్రబాబు నాయుడుకు గుండె సంబంధిత సమస్య ఉందని అతని తరఫు లాయర్లు ఏపీ హైకోర్టుకు తెలిపారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు.
Chandrababu Has A Heart Problem.. Lawyers told the court
Chandrababu: ఇటీవల చంద్రబాబు (Chandrababu) కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కోసం కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. చంద్రబాబు (Chandrababu) హెల్త్ కండీషన్ గురించి ఆయన తరఫు లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబు (Chandrababu) కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగిందని పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారని తెలిపారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. తగిన విశ్రాంతి తీసుకోవాల్సి ఉందన్నారు. షుగర్ కంట్ర్ల్లో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో చంద్రబాబు (Chandrababu) అరెస్టైన సంగతి తెలిసిందే. కంటి చూపు ఆపరేషన్ కోసం బెయిల్ మీద బయటకు వచ్చారు. నెలరోజుల మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో.. విశ్రాంతి కావాలని కోర్టును కోరారు. అందుకు సంబంధించి రిపోర్టులు సమర్పించి ఉంటారు. దానిపై ధర్మాసనం తీర్పు ఇవ్వాల్సి ఉంది.